Boora Narsaiah Goud: తెరాసకు బిగ్ షాక్.. పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ
మునుగోడు ఉపఎన్నిక ముందు తెరాస ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు కేసీఆర్‌కు తన రాజీనామా లేఖను పంపించారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంటూ పార్టీలో తనను అవమానించారని, వ్యక్తిగతంగా చాలా బాధపడ్డానంటూ బూర నర్సయ్య గౌడ్ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
Boora Narsaiah Goud: మునుగోడు ఉపఎన్నిక ముందు తెరాస ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు కేసీఆర్‌కు తన రాజీనామా లేఖను పంపించారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంటూ పార్టీలో తనను అవమానించారని, వ్యక్తిగతంగా చాలా బాధపడ్డానంటూ బూర నర్సయ్య గౌడ్ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా తన ఓటమి వెనుక అంతర్గత కుట్ర ఉందని బూర నర్సయ్య గౌడ్ అన్నారు. అభిమానానికి, బానిసత్వానికి చాలా తేడా ఉంటుందంటూ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఉద్యమకారులకు సరైన గౌరవం ఇవ్వడంలేదని వాపోయారు. మునుగోడులో బీసీలు వివక్షకు గురికావడం తనను బాధించిందని లేఖలో పేర్కొన్నారు. తనకు సమాచారం ఇవ్వకుండానే మునుగోడు అభ్యర్ధిని ప్రకటించారని, ఆత్మగౌరవ సభలకు తనకు ఉద్దేశపూర్వకంగానే
సమాచారం ఇవ్వలేదని లేఖలో ప్రస్తావించారు. తెలంగాణలో బీసీలు వివక్షకు గురవుతున్నారని, బీసీలకు టికెట్ పరిశీలించమని అడగడం కూడా నేరమేనా? అంటూ ఆయన ప్రశ్నించారు. తనకు అవమానం జరుగుతుందని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వెల్లగక్కారు. అన్నీ తెలిసి కూడా కేసీఆర్ మౌనంగా ఉన్నారని, అందుకే పార్టీని వీడుతున్నట్లు లేఖలో స్పష్టం చేశారు.
ఇటీవల కేసీఆర్‌ను కలవాలంటే తెలంగాణ కంటే పెద్ద ఉద్యమం చేయాల్సిన పరిస్ధితి ఉందని, రాజకీయ వెట్టి చాకిరిని తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం భరించలేరని బూర నర్సయ్యగౌడ్ విమర్శించారు.
ఇదీ చదవండి:ఉప్పెనలా “విశాఖ గర్జన”.. వికేంద్రీకరణే లక్ష్యంగా..!