Home / Boora Narsaiah Goud
తెరాస పార్టీలో నుండి భాజపా లో చేరిన తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అధికార పార్టీ నేతల నోర్లు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. నేడు ఢిల్లీ భాజపా పెద్దల సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరిన వెంటనే తెరాస నేతలను టార్గెట్ చేస్తూ విమర్శించారు.
మునుగోడు ఉపఎన్నిక ముందు తెరాస ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు కేసీఆర్‌కు తన రాజీనామా లేఖను పంపించారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంటూ పార్టీలో తనను అవమానించారని, వ్యక్తిగతంగా చాలా బాధపడ్డానంటూ బూర నర్సయ్య గౌడ్ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ ఉపఎన్నిక పోరుకు ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు విడుదల చేస్తారో తెలీకున్నా.. నియోజకవర్గంలో పరిస్థితులు రాజకీయ పార్టీలకు టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ ఉప పోరులో అధికార పార్టీ అభ్యర్థిగా పలువురి పేర్లు వినిపిస్తున్న వేళ.. తాజాగా మాజీ ఎంపీ.. కేసీఆర్ కు సన్నిహితుడైన బూర నర్సయ్య గౌడ్ రేసులోకి వచ్చేసిన వైనం కలకలంగా మారింది.