Last Updated:

Ashok Galla: అశోక్ గల్లా ‘దేవకి నందన వాసుదేవ’ హిట్‌ – మూవీ టీం కీలక నిర్ణయం

Ashok Galla: అశోక్ గల్లా ‘దేవకి నందన వాసుదేవ’ హిట్‌ – మూవీ టీం కీలక నిర్ణయం

Ashok Galla Success Tour: గతవారం థియేటర్‌లో మీడియం రేంజ్‌ హీరోల సినిమాలు సందడి చేశాయి. అందులో విశ్వక్‌ సేన్‌ ‘మెకానిక్‌ రాకీ’, సత్యదేవ్‌ ‘జిబ్రా’, అశోక్‌ గల్లా ‘దేవకి నందన వాసుదేవ’. మూడు డిఫరెంట్‌ జానర్స్‌. ఒక్కొక్కొ సినిమా ఒక్కో విధంగా రిజల్ట్‌ చూశాయి. అయితే ఇందులో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు మేనల్లుడు అశోక్‌ గల్లా దేవకి నందన వాసుదేవ మూవీపై మొదట ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. హనుమాన్ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ స్క్రీన్‌ప్లే అనగానే బజ్‌ క్రియేట్‌ అయ్యింది. ప్రచార పోస్టర్స్, టీజర్‌, ట్రైలర్‌లు కూడా ఆడియన్స్‌ని మెప్పించాయి.

దీంతో ఈసారి అశోక్‌ గల్లాకు హిట్‌ ఖాయమని అంతా అభిప్రాయపడ్డారు. అలా భారీ అంచనాల మధ్య థియేటర్లో విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌డే ఫస్ట్‌ షో నుంచి డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. స్టోరీ బాగుంది. అశోక్‌ గల్లా కూడా తన యాక్టింగ్‌తో మెప్పించాడు. కానీ కుర్ర హీరో అశోక్‌ గల్లా ఈ కథకి ఓవర్‌ క్వాలిఫైడ్‌ అనే రివ్యూస్‌ వచ్చాయి. దీంతో మొదటి రోజు వసూళ్లు అంతమాత్రంగానే వచ్చాయి. ఈసారి కూడా అశోక్‌ గల్లాకు ఈ సినిమా వర్కౌట్‌ కాలేదని క్రిటిక్స్‌ అభిప్రాయపడ్డారు. కానీ రెండో రోజుకు ఊహించని విధంగా దేవకి నందన వాసుదేవ కలెక్షన్స్ పుంజుకున్నాయి.

మౌత్‌ టాక్‌తో రోజురోజుకు సినిమాకు కలెక్షన్స్‌ పెరిగాయి. కమర్షియల్ సినిమాకి డివోషనల్ టచ్ ఇవ్వడంతో మెల్లిగా దేవకి నందన వాసుదేవ ఆడియన్స్‌లోకి రీచ్‌ అవ్వడం మొదలైంది. ఇందులో భారీ యాక్షన్స్‌ సీక్వెన్స్‌ ఉండటంతో మాస్‌ ఆడియన్స్‌కి కూడా మూవీ బాగా నచ్చింది. అతడి డెబ్యూ మూవీ ‘హీరో’తో పోలిస్తే అశోక్‌ గల్లా ఈ చిత్రంలో మెరుగైన నటన ప్రదర్శించాడు. యాక్షన్ సీన్స్‌లోనూ పవర్ఫుల్‌గా కనిపించాడు. ఎమోషన్స్‌ కూడా బాగా పలికించాడు. దీంతో అతడి నటనకు ఆడియన్స్‌ నీరాజనాలు పలికారు. రోజురోజుకు మూవీకి పాజిటివ్‌ టాక్‌ రావడంతో కలెక్షన్స్‌ కూడా బాగా పెరిగాయి. ముఖ్యంగా బీ,సీ సెంటర్స్‌లో వీకెండ్స్ హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపించాయి.

ఫైనల్‌గా మూవీ హిట్‌ ట్రాక్‌లో పడటమే కాదు కలెక్షన్స్‌ కూడా భారీగా పెంచుకుంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేందుకు దేవకి నందన వాసుదేవ టీం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమాను మరింత ప్రేక్షకులల్లోకి తీసుకువెళ్లడానికి ప్రమోషన్స్‌ మరింత గట్టిగా ప్లాన్‌ చేసింది. ఇందుకోసం తెలుగు రాష్ట్రాల్లో హీరోతో సక్సెస్‌ టూర్ ప్లాన్‌ చేసింది. ప్రస్తుతం అశోక్‌ గల్లా రెండు తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ టూర్‌ చేపట్టాడు. ఆ ఊరు ఈ ఊరు అని కాకుండా అన్ని థియేటర్లు సందర్శిస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి వెళ్లిన అశోక్‌ గల్లాకు ఆడియన్స్‌ నీరాజనాలు పలుకుతున్నారు. ఈ సక్సెస్‌ టూర్‌కి వస్తున్న రెస్పాన్స్‌ చూస్తుంటే మూవీ కలెక్షన్స్‌ మరింత పెరిగెలా కనిపిస్తుంది. ఈ వారం పెద్ద సినిమాలు కూడా లేకపోవడంతో అశోక్‌ గల్లా ప్లాన్‌ వర్కౌట్ అయ్యేలా ఉందనిపిస్తోంది.