Last Updated:

Anaganaga Australia Lo Movie Review: విదేశాల్లోని యథార్థ సంఘటనల ఆధారంగా ‘అనగనగా ఆస్ట్రేలియాలో’ – సినిమా ఎలా ఉందంటే!

Anaganaga Australia Lo Movie Review: విదేశాల్లోని యథార్థ సంఘటనల ఆధారంగా ‘అనగనగా ఆస్ట్రేలియాలో’ – సినిమా ఎలా ఉందంటే!

Anaganaga Australia Lo Movie Review in Telugu: తారక రామ దర్శకత్వంలో సహాన ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై బి.టి ఆర్‌ శ్రీనివాస్‌ నిర్మాణంతో తెరకెక్కిన చిత్రం ‘అనగనగా ఆస్ట్రేలియాలో’. మన దేశంలో జరిగే సంఘటనలు ఎలా ఉంటాయనేది తెలుసు. కానీ విదేశాల్లో ఎలా ఉంటాయి, అక్కడ మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుందనేది పెద్దగా అవగాహన ఉండదు. అదే ఈ చిత్రంతో ఇండియన్‌ ఆడియన్స్‌కి చూపించే ప్రయత్నం చేసింది ‘అనగనగా ఆస్ట్రేలియాలో. యదార్థ సంఘటన ఆధారం తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందించేందుకు నేడు (మార్చి 21) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ప్రచార పోస్టర్స్‌, టీజర్‌, ట్రైలర్‌లతో మూవీపై అంచనాలు నెలకొన్నాయి. పైగా షూటింగ్‌ మొత్తం విదేశాల్లోనే జరిగింది. ఆస్ట్రేలియాలోని 83 రియల్‌ లోకేషన్స్‌లో కేవలం 122 రోజుల్లోనే ఈ సినిమాను చిత్రీకరించారు. టీజర్‌, ట్రైలర్‌లు అద్భుతమైన విజువల్స్‌ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యింది. పైగా ఆస్ట్రేలియాలో జరిగే రియల్‌ ఇన్సిడెంట్స్‌ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కడంలో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మరి అంచనాలతో నేడు థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్‌ ఏ మేరకు ఆకట్టుకుటుంది, మూవీ ఎలా ఉందనేది ఇక్కడ చూద్దాం!

అడుగడుగున ఊహించని ట్విస్ట్స్

సాధారణం థ్రిల్లర్‌ జానర్స్‌కి అంటే ఆసక్తి ఉండని ప్రేక్షకులు ఉండరు. పైగా విదేశాల్లోనే జరిగే నిజ సంఘటనలను ‘అనగనగా ఆస్ట్రేలియాలో’ చిత్రం ద్వారా చూపించాలన్న దర్శకుడి ప్రయత్నం ఫలించిందనే అనిపిస్తోంది. ఈ సినిమా చూసి అనగనగా ఆస్ట్రేలియాలో మంచి థ్రిల్‌ ఇచ్చింది. ప్రతి షాట్‌ స్టన్నింగ్‌ విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది. మొదటి నుంచి చివరి వరకు అడుగడుగున ఊహించిన ట్విస్ట్స్‌తో మూవీ ఆసక్తికరంగా సాగుతుంది. సస్పెన్స థ్రిల్లర్‌ అంశాలతో మూవీ మొత్తం ఉత్కంఠగా సాగింది. ఊహించని ట్విస్ట్‌ ఆడియన్స్‌ని చెయిర్లకు అతుక్కుపోయేలా చేసింది. అద్భుతమైన బ్యాగ్రౌండ్‌ స్కోర్‌, బీజీయంతో ప్రతి సీన్‌ ఎలివేట్‌ చేశారు. థ్రిల్లర్‌ జానర్స్‌ ఇష్టపడే మూవీ లవర్స్‌ లెక్కలేనన్ని థ్రిల్లింగ్‌ సీన్స్‌తో కనువిందు చేశారు. అద్భుతమైన విజువల్స్‌, టేకింగ్‌ మొత్తానికి ‘అనగనగా ఆస్ట్రేలియాలో’ సరికొత్త అనుభూతిని ఇచ్చింది.

కథ:

హీరో ఒక క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తూ సాధాణ జీవితం గడుపుతుంటాడు. ఇక హీరోయిన్‌ చుదువుకుంటూనే పార్ట్‌ టైం వర్క్‌ చేస్తూ ఉంటుంది. చిన్న చిన్న అసైమెంట్స్‌ రాస్తూ డబ్బులు సంపాదించుకుని తన ఫిజు తానే కట్టుకుంటుంది. అలా ఒక రోజు హీరోహీరోయిన్స్‌ మధ్య పరిచయం ఏర్పుడుతుంది. అది ప్రేమగా మారుతుంది. అదే సమయంలో ఓ పేరున్న రాజకీయ నేత తన కొడుకుని పాలిటిక్స్‌లోని తీసుకువచ్చేందుకు ప్లాన్‌ చేస్తుంటాడు. అయితే దానికి ఓ కండిషన్‌ ఉంటుంది. దానివల్ల అతడిని రాజకీయాల్లోని తీసుకురావడం సాధ్యం కాదు. అదేంటో తెలుసుకుని తన కొడుకుని రాజకీయాల్లో తీసుకువచ్చేందుకు ఓ ఎత్తుగడ వేస్తాడు.

ఆ రహస్యాన్ని ఛేదించమని కొందరికి అప్పగిస్తాడు. ఇందుకోసం వారికి భారీ డబ్బు ఆఫర్‌ చేస్తాడు. ఈ క్రమంలో ఓ రోజు హీరోయిన్‌ తన అసైన్‌మెంట్స్‌ డబ్బులు తీసుకునేందుకు ఓ వ్యక్తి దగ్గరికి వెలుతుంది. పొరపాటున ఆమె క్రిమినల్స్‌ ఉన్న గదికి వెళుతుంది. ఇది తన అనుకున్న వ్యక్తి గది కాదని వెనక్కి వెళుతున్న ఆమె అక్కడ కొన్ని వస్తువులను చూసి ఆశపడి వాటిని దొంగలిస్తుంది. ఆ రూమ్‌లో క్రిమినల్స్‌ పెద్ద స్కామ్‌కి పాల్పడుతుంటారు. అది తెలియని ఆమె ఈ చిన్న వస్తువులు దొంగలించడం వల్ల ఆ స్కామ్‌ తాను కూడా భాగం అవుతుంది. ఆమె కోసం ఇటూ పోలీసులు, అటూ క్రిమినల్స్‌ వెతుకుతుంటారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఈ కేసు నుంచి హీరోయిన్‌ ఎలా బయటపడింది? అక్కడ జరిగిన స్కాం ఏంటనేది తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

కథనం ఎలా ఉందంటే

డైరెక్టర్‌ తారకరామ టేకింగ్‌, నేరేషన్‌కి ఆడియన్స్‌ నుంచి మంచి మార్కులు వస్తున్నాయి. మణిరత్నం, శంకర్‌, ఆర్జీవీ లాంటి అగ్ర దర్శకుల టేకింగ్ మిక్స్‌తో క్వెంటిన్ టారంటినో శైలిలో డైరెక్షన్ చేసి స్టోరీ నేరేషన్ పరంగా ఒక ప్రత్యేకమైన ఒరవడి నెలకొల్పారు దర్శకుడు తారక రామ. సహాజంగా అనిపించే డైలాగ్స్‌తో పాత్ర ప్రతి పాత్రకు డెప్త్‌ ఇచ్చారు. ఆడియన్స్‌ని పాత్రలో లీనమయ్యే విధంగా ఆయా నటులు తమ అద్భుతమైన నటనను కనబరిచారు. యూవీ నిరంజన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. ఇక బీజీఎం ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేసేలా అద్భుతంగా కంపోజ్‌ చేశారు. ఫైనల్‌గా ఈ చిత్రంతో సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా సాగింది. ఇక టాలీవుడ్‌లో చాలా తక్కువగా కనిపించే Neo – Noir Thriller జానర్‌లో వచ్చిన ఈ సినిమా హాలీవుడ్ మేకింగ్‌ స్టైల్‌తో టెక్నికల్‌గా అత్యున్నత ప్రమాణాలు కలిగి ఆడియన్స్‌కి కొత్త అనుభూతిని ఇచ్చింది.

చివరిగా సినిమా గురించి ఒక్క మాటలో.. తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టుపైకి తీసుకెళ్లే ప్రయత్నంగా ‘అనగనగా ఆస్ట్రేలియాలో’ నిలుస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Rating: 2.75/5