Trian Accident: కోరమాండల్ ప్రమాదం.. ప్రపంచ దేశాల దిగ్భ్రాంతి
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు, సన్నిహితులకు ఉక్రెయిన్ ప్రజల తరపున ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Trian Accident: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు, సన్నిహితులకు ఉక్రెయిన్ ప్రజల తరపున ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు జెలెన్ స్కీ ట్వీట్ చేశారు.
On behalf of myself and the people of Ukraine, I express my deepest condolences to Prime Minister @narendramodi and all relatives and friends of those killed in the train accident in the state of Odisha. We share the pain of your loss. We wish a speedy recovery for all those…
— Володимир Зеленський (@ZelenskyyUa) June 3, 2023
సాయం అందించేందుకు సిద్ధం(Trian Accident)
అదే విధంగా ఇతర దేశాల నేతలు సైతం తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడ్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వోంగ్, శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ, భారత లో రష్యా రాయబారి డెనిస్ అలిపోప్, తైవాన్ ప్రెసిడెంట్ త్సాయ్ ఇంగ్ వెన్, యూఎస్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ సాబా కోరోసి.. మొదలైన నేతలు సంఘీభావం ప్రకటించారు. ఈ ఘోర ప్రమాదం పట్ల అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధమని ఆయా దేశాలు ప్రకటించాయి.
ఘటనా స్థలికి ప్రధాని
కాగా, ఒడిశా ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు ప్రధాన నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి బయలుదేరారు. ఈ రోజు ఉదయం కోరమాండల్ రైలు ప్రమాదంపై ఉన్నతాధికారులతో ప్రధాని సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన ఒడిశా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఘటనా స్థలంలో పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించి.. అనంతరం కటక్ ఆస్పత్రిలో క్షతగాత్రులను ప్రధాని పరామర్శించనున్నారు.
మరోవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాలాసోర్ రైలు ప్రమాద స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. మృతుల్లో ఎక్కువగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.