Joint pain in monsoon?: వర్షాకాలంలో కీళ్లనొప్పులతో బాధపడుతున్నారా..? ఈ సులువైన యోగాసనాలతో ఉపశమనం పొందండి.!

Joint pain in monsoon?: చల్లదనం మనిషికి జబ్బులను తీసుకువస్తుంది. అందుకే వర్షాకాలం, చలికాలంలో చాలా మంది జబ్బుపడతారు. ఇఫ్పుడు మనం వర్షాకాంలోకి ఎంటర్ అయ్యాం కాబట్టి కొన్ని వ్యాధులు ఎటాక్ చేయడానికి రెఢీ అయ్యాయి. అందులో మొదటిది కీళ్లనొప్పులు. వర్షాకాలంలో వాతావరణం తేమగా ఉండటం వలన శరీరంలోని కీళ్ల చుట్టూ ఉన్న కణజాలం నొప్పులకు గురవుతాయి. ఈ సీజన్ లో విటమిన్ డి ఎక్కువగా లభించదు. దీనివలన ఎముక ఆరోగ్యంపై ప్రభావం చూపెడుతుంది. వాపులకు శరీరం గురవుతుంది. అయితే సాధారణ యోగా భంగిమలతో వర్షాకాలంలో బాధించే కీళ్లనొప్పులను తగ్గించుకోవచ్చని అంటున్నారు నిపుణులు.
యోగాలోని చిన్నపాటి ఆసనాలు కీళ్ల నొప్పిని తగ్గించడంతోపాటు మంటను కూడా అదుపులోకి తెస్తుంది. వయసుమీరిన వారిలో కొందరికి కీళ్లలో, అరికాళ్లలో మంటలు వస్తాయి. వాటిని కూడా యోగా ద్వారా కంట్రోల్ లోకి తీసుకురావచ్చు. అర్థరైటిల్ ఉన్నవారిలో కీళ్లనొప్పులు, ఎముకలలోని బలాన్ని అధికంగా తగ్గించగలవని నిరూపణ అయింది. అయితే కీళ్ల నొప్పులను తగ్గించడానికి సిఫార్సు చేయబడిన నాలుగు యోగ భంగిమలు
1. వజ్రాసనం
వజ్రాసనం అనేది యోగాలో చాలా ఫేమస్ అయిన ఆసనం దీన్ని చాలామంది సులువుగా చేసేస్తారు. కొన్ని మతాలలో కూడా దీన్ని వాడతారు. అయితే దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
ముందుగా కాళ్లను చాపి కూర్చోవాలి. ఆతర్వాత మోకాళ్లపై కూర్చోవాలి. అటాగే పిరుదులను అరికాళ్లపై వచ్చేలా కూర్చోవాలి. వెన్నుముఖ నిటారుగా ఉంచాలి. దీంతో మడమలపై ( అరికాళ్లపై) కూర్చుంటారు. మీ చేతులను తొడలపై ఉంచి 5 నుంచి 10 నిమిషాలు కూర్చోవాలి. శ్వాసను సుఖంగా తీసుకుని వదులుతుండాలి. ఇది జీర్ణ క్రియకు సహాయపడుతుంది. మంటను తగ్గిస్తుంది. మోకాలు, చీలమండలంకు బలాన్ని ఇస్తుంది.

Vajrasanam
2. తడాసన
ఈ ఆసనాన్ని చేయడానికి ముందుగా నిల్చోవాలి ఎందుకంటే ఈ ఆసనాన్ని నిల్చోని చేస్తారు. రెండు పాదాలను దెగ్గరగా పెట్టి చేతులను పైకి లేపండి. దీంతోపాటే వేళ్లపై లేవండి. దీంతో పాటే శరీరాన్ని పైకి సాగదీయండి. ఒక 15సెకన్ల పాటు చేసాక మొదటి స్థానానికి రండి. ఇలా ఒక 5 సార్లు చేయండి. దీంతో మీ బరువు మొత్తం మీ వేళ్లపై పడి శరీరంలోని ప్రతీ రక్తనాళానికి రక్త ప్రసరణ సరిగ్గా అందుతుంది. కణాలు చైతన్యం అవుతాయి.

Tadasanam
3. సేతు బంధాసనం ( వంతెనలాంటి భంగిమ )
ముందుగా నేలపై పడుకోండి, ఆతర్వాత మెళ్లిగా నడుమును లేపండి కాళ్లను ముడుచుకుంటూనిలబెట్టండి అప్పుడు ఈ ఫొటోలో ఉన్నవిధంగా కనపడుతుంది. కడుపు, వెన్నెపూస పైకి ధనస్సు లాగ వంగుతుంద. ఇలా 10 సెకన్ల పాటు చేయండి తిరిగి యాధాస్థానానికి రండి. అయితే ఇప్పుడు చెబుతున్న యోగాసనాలు నిపుణుల సమక్షంలో చేయండి. ఒంటరిగా ప్రయోగాలు చేయకండి.
ఈ యోగాసనంలో వీపు, వెన్నుపూస, మోకాళ్లు బలపడతాయి. రక్తప్రసరణ పెరుగుతుంది.

Setu Bandhasanam
4. అర్ద మత్య్సేంద్రాసనం
ఈ ఆసనం వలన వెన్నుముక, భుజాలు, తుంటిలో కదలికను మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియకు తోడ్పడుతుంది. కీళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గర్భం ధరించిన వారు, వెన్నుముఖ సమస్యలు ఉన్నవాళ్లు, హెర్నియోతో బాధపడుతున్నవాళ్లు ఆసనాలను వేయకండి.

Ardha Matsyendrasanam
గమనిక… పైన తెలిపిన ఆసనాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. సొంతంగా ఎవరూ ఆసనాలు వేయవద్దు. నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే బేసిక్ నుంచి నేర్చుకోవాలి. కచ్చితత్వానికి చానల్ బాధ్యత వహించదు.