Published On:

PM Modi: ‘యోగాంధ్ర..’ గిన్నీస్ రికార్డు.. అనేక మందిని ప్రేరేపించిందని మోదీ ప్రశంసలు

PM Modi: ‘యోగాంధ్ర..’ గిన్నీస్ రికార్డు.. అనేక మందిని ప్రేరేపించిందని మోదీ ప్రశంసలు

PM Modi Key Statements About 1th International Yoga Day Guinness World Record: ఈనెల 21 వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీలో విశాఖ తీరాన ‘యోగాంధ్ర’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విశాఖలో నిర్వహించిన యోగాంధ్రపై గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు చేసిన పోస్ట్‌పై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు.

 

‘వైజాగ్‌లో జరిగిన యోగాంధ్ర అందరినీ ఒక్కతాటిపై నిలిపింది. 3 లక్షల మందితో యోగా చేసి సరికొత్త రికార్డు నెలకొల్పారు. యోగాను జీవితంలో భాగం చేసుకున్న ఏపీ ప్రజలకు నా అభినందనలు. యోగా కార్యక్రమం ప్రేరేపించింది. ఏపీ ప్రజలను ఏకం చేసింది. యోగా అందరినీ ఏకం చేస్తుందని మరోసారి నిరూపితమైంది.’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

 

ఇదిలా ఉండగా, ఏపీలోని విశాఖలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా మొత్తం 3 లక్షల 105 మంది పాల్గొన్నారు. దీంతో వరల్డ్ రికార్డు నమోదైంది. ఈ మేరకు గిన్నీస్ వరల్డ్ రికార్డు ప్రశంసలు వర్షం కురిపిస్తూ చేసిన పోస్టుపై ప్రధాని మోదీ తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ స్పందించారు.

 

గిన్నిస్ రికార్డ్స్‌లో యోగాంధ్రకు స్థానం దక్కడం గర్వకారణమని, రాష్ట్ర ప్రజలకు సీఎం అభినందనలు తెలిపారు. ‘ప్రజల అంకిత భావం స్ఫూర్తిని నింపింది. మంచి పనికి కలిసి వస్తే.. అద్భుతాలు సృష్టించవచ్చు.’ అని రాసుకొచ్చారు. అలాగే ఈ రికార్డుపై మంత్రి లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. బ్రాండ్ విశాఖ వేదికగా యోగాలో ప్రపంచ రికార్డులను బ్రేక్ చేశామని తెలిపారు.

ఇవి కూడా చదవండి: