Published On:

International Yoga Day 2025: అంతర్జాతీయ ఆరోగ్య ‘యోగా’.. రాజకీయ, సినీ ప్రముఖుల సందడి

International Yoga Day 2025: అంతర్జాతీయ ఆరోగ్య ‘యోగా’.. రాజకీయ, సినీ ప్రముఖుల సందడి

International Yoga Day 2025: యోగా శారీరక వ్యాయామమే కాదు.. ఒక జీవన విధానం. యోగాతో కలిగే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవడంతో పాటు ఆచరించాల్సిన ఆవశ్యకత ఉంది. యోగాను నిత్యం సాధన చేయడం ద్వారా ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు.

 

కాగా, ఇటీవల కాలంలో యోగాపై ప్రజల్లో ఆసక్తి విపరీతంగా పెరిగింది. ఎక్కువ మంది యోగాను చేస్తున్నారు. అయితే యోగా పుట్టింది మన దేశంలోనే. 2,500 ఏళ్ల క్రితం పతంజలి మహార్షి ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగానే ఐక్యరాజ్యసమితి సమితి యోగా ప్రాముఖ్యాన్ని గుర్తించి ప్రతి ఏడాది జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది.

 

యోగా అనేది అందరిదీ. అందరూ చక్కగా చేయవచ్చు. అన్ని వయసుల వారు యోగాను చేయవచ్చు. సొంతంగా కంటే గురువుల మార్గదర్శకంలో చేస్తే ఎక్కువ ఫలితాలు ఉంటాయని యోగా సాధకులు చెబుతున్నారు. యోగాను మీ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంగా, మానసికంగా ప్రశాంతంగా జీవిస్తారని చెబుతున్నారు.

 

అయితే, ప్రశాంత నిద్ర కోసం ఒత్తిడిని తగ్గించే బాలాసనంతో పాటు శరీరాన్ని రిలాక్స్ చేసి నిద్రను ప్రోత్సహించే సుప్త బద్ధకోణాసనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, రక్తప్రసరణను మెరుగుపరిచే విపరీత కరణి, నాడీ వ్యవస్థను శాంతపరిచే శావాసనం, మనసును ప్రశాంత పరిచే అనులోమ విలోమ ప్రాణాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు.

 

తాజాగా, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా సినీ, రాజకీయ తదితర రంగాల ప్రముఖులు ప్రత్యేక ఈవెంట్లలో పాల్గొన్నారు. ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ, డెహ్రాడూన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉదంపూర్‌లో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఢిల్లీలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు జైశంకర్, నడ్డా, శివరాజ్ పాల్గొన్నారు. ఇక, మహారాష్ట్రలో సీఎం ఫడ్నవీస్ సతీమణి అమృత, బాలీవవుడ్ హీరోయిన్ నుష్రత్ బరూచాతో కలిసి ముంబైలో యోగా ఈవెంట్‌కు హాజరయ్యారు. అనంతరం స్థానికులతో కలిసి యోగాసనాలు చేశారు. ప్రధాని మోదీ కారణంగా యోగాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు. ఫొటో సెషన్‌లా కాకుండా అందరూ ప్రతి రోజూ ఆసనాలు వేయాలని సూచించారు.

ఇవి కూడా చదవండి: