Last Updated:

ఆఫ్ఘనిస్తాన్ : ఆఫ్ఘాన్ లో పరాకాష్టకు చేరిన తాలిబన్ల ఆకృత్యాలు… ఇకపై మహిళలకు నో ఎంట్రీ!

ఆఫ్ఘనిస్తాన్ : ఆఫ్ఘాన్ లో పరాకాష్టకు చేరిన తాలిబన్ల ఆకృత్యాలు… ఇకపై మహిళలకు నో ఎంట్రీ!

Afganisthan : అఫ్గనిస్థాన్‌లో తాలిబన్లు ప్రభత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి మహిళలకు దారుణ పరిస్థితులు ఎదురవుతున్నాయి. అమ్మాయిలు విద్యా, ఉద్యోగాలు, క్రీడారంగానికి క్రమక్రమంగా దూరం అవుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా అమ్మాయిలను విద్యకు పూర్తిగా దూరం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ తక్షణ నిర్ణయంగా ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో తాలిబన్ల చర్య పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా మహిళల విద్యాబోధన విషయంలో తాలిబన్లు తీసుకున్న నిర్ణయం అమ్మాయిలు భవిష్యత్తుకు శాపంగా మారనుంది. వీరి నిర్ణయం పట్ల విద్యావేత్తలు, సాధారణ పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో సహావిద్య విధానాన్ని తాలిబన్లు నిషేధించారు. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి చదువుకోవడం ఇకపై కుదరదని తేల్చిచెప్పారు. దాంతో కొంతమేర వారు విద్యకు దూరం అయ్యారు. ఆ తర్వాత ఆడపిల్లలకు చదువు చెప్పడానికి పురుషులను అనుమతించరు. దేశంలో అన్ని విద్యా కార్యకలాపాలు షరియా చట్టం ప్రకారం జరుగుతాయని తేల్చిచెప్పారు.

అయితే ఆ నిర్ణయం కారణంగా బాలికలను ఉన్నత విద్య నుండి దూరం చేస్తుంది అక్కడి విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో తాలిబన్‌ నేతలు మాత్రం వాళ్ల పిల్లలను విదేశాల్లో చదివిస్తూ స్వేచ్ఛగా ఉండనిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న తాలిబన్‌ కేబినెట్‌లో 25 మంది దాకా తమ పిల్లలను పొరుగున ఉన్న పాక్‌లోని పెషావర్‌, కరాచీలో.. ఇంకొందరు దోహాలోని స్కూల్స్‌లో పిల్లలను చదివించుకుంటున్నారు. వాళ్లలో ఆరోగ్య మంత్రి ఖ్వాలందర్‌ ఎబాద్‌, విదేశాంగ ఉపముఖ్యమంత్రి షేర్‌ మహమ్మద్‌ అబ్బాస్‌ స్టానిక్‌జాయ్‌, తాలిబన్‌ అధికార ప్రతినిధి సుహెయిల్‌ షాహీన్‌లు పిల్లలు కూడా ఉన్నారు. వారి పిల్లలకు ఒక న్యాయం, సాధారణ పిల్లలకు ఒక న్యాయమా అంటూ అంతా తాలిబన్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు.

ఈ మేరకు ఒక మాజీ ప్రభువ అధికారి తన చెల్లెలి గురించి ఒక ఆసక్తికర పోస్ట్ చేశాడు. తన చెల్లి కెరీర్ గురించి మాట్లాడుతూ తాలిబన్ల నిర్ణయం వల్ల ఆమె భవిష్యత్తు పరిస్థితి, వారి కుటుంబ పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారిందని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి: