Last Updated:

Pakistan: భారత్ సాయం కోరిన పాకిస్తాన్.. ఎందుకంటే..?

ఇటీవల కాలంలో కురిసిన వర్షాల కారణంగా పాకిస్తాన్ను వరద ముంచెత్తింది. చరిత్రలో ఎన్నడూ లేనంతంగా పాక్‌లో వరద బీభత్సం సృష్టించింది. దానితో దాయాదీ దేశం ఇప్పుడు భారత్‌ సాయం కోరుతున్నది.

Pakistan: భారత్ సాయం కోరిన పాకిస్తాన్.. ఎందుకంటే..?

Pakistan: ఇటీవల కాలంలో కురిసిన వర్షాల కారణంగా పాకిస్తాన్ను వరద ముంచెత్తింది. చరిత్రలో ఎన్నడూ లేనంతంగా పాక్‌లో వరద బీభత్సం సృష్టించింది. దానితో దాయాదీ దేశం ఇప్పుడు భారత్‌ సాయం కోరుతున్నది.

వరద ప్రభావిత ప్రాంతాల్లో దోమల వల్ల ప్రజలు అల్లాడుతున్నారు. ఈ కారణంగా ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. దీనితో దోమల వల్ల వ్యాధులు వ్యాపించకుండా ఉండేందుకు ప్రజలకు దోమ తెరలు అందించనుంది పాక్ ప్రభుత్వం. దీనికి గానూ ఇండియా నుంచి పెద్దసంఖ్యలో దోమ తెరలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. 6.2 మిలియన్ల దోమతెరలు కొనాలన్న ప్రతిపాదనను పాక్ ప్రభుత్వం ఆమోదించింది.

ఇప్పటికీ పాకిస్తాన్లోని పలు ప్రాంతాలు నీటమునిగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 32 వరద ప్రభావిత జిల్లాల్లో మలేరియా వేగంగా విస్తరిస్తున్నది. ఈ క్రమంలో దోమల వల్ల కలిగే వ్యాధుల నుంచి తమ పౌరులను రక్షించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అధికారులు వెల్లడించారు. కాగా భారీ వరదలు సంభవించడంతో పాక్లో 1600 మంది మరణించారు. భారీగా ఆస్తి నష్టం జరిగిందని అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి: చేతి పంపు కొడితే బక్కెట్ల కొద్దీ మద్యం వస్తోంది..!

ఇవి కూడా చదవండి: