Last Updated:

Pakistan: పాకిస్తాన్ :కరాచీలోని షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం.. 11 మంది మృతి

: పాకిస్తాన్‌లోని కరాచీలో రషీద్ మిన్హాస్ రోడ్‌లోని బహుళ అంతస్తుల షాపింగ్ మాల్‌లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 11 మంది మరణించగా పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు, జియో న్యూస్ నివేదించింది. కరాచీ మేయర్ ముర్తాజా వహాబ్ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ X లో మరణించిన వారి సంఖ్యను ధృవీకరించారు. భవనంలో వ్యక్తుల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు.

Pakistan: పాకిస్తాన్ :కరాచీలోని షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం.. 11 మంది మృతి

Pakistan: పాకిస్తాన్‌లోని కరాచీలో రషీద్ మిన్హాస్ రోడ్‌లోని బహుళ అంతస్తుల షాపింగ్ మాల్‌లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 11 మంది మరణించగా పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు, జియో న్యూస్ నివేదించింది. కరాచీ మేయర్ ముర్తాజా వహాబ్ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ X లో మరణించిన వారి సంఖ్యను ధృవీకరించారు. భవనంలో వ్యక్తుల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు.

ఆరుగురి పరిస్దితి విషమం..(Pakistan)

అగ్నిమాపక దళం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, రెండు స్నార్కెల్స్, ఎనిమిది ఫైర్ టెండర్లు మరియు ఒక బౌసర్‌తో ఆపరేషన్‌లో ఆర్‌జే షాపింగ్ మాల్‌లో చిక్కుకున్న 50 మందిని రక్షించారు.భవనంలో చిక్కుకుపోయిన వారందరినీ రక్షించేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మంటలు అదుపులోకి వచ్చాయి. ప్రస్తుతం ఒక అంతస్తులో శీతలీకరణ ప్రక్రియ కొనసాగుతోందని జియో న్యూస్ నివేదించింది.ఉదయం 7 గంటలకు రెండో అంతస్తులో మంటలు చెలరేగగా, మాల్‌లోని నాలుగు, ఐదు, ఆరో అంతస్తులకు మంటలు వ్యాపించాయి. అయితే మంటలు చెలరేగడానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి తరలించారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.

సింధ్ కేర్‌టేకర్ చీఫ్ మినిస్టర్ జస్టిస్ (రిటైర్డ్) మక్బూల్ బకర్ ఈ సంఘటనలో ప్రాణనష్టానికి సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందించాలని ఆదేశాలు జారీ చేసారు.కరాచీ డిప్యూటీ కమిషనర్ (డీసీ) సలీం రాజ్‌పుత్ ఘటనా స్థలాన్ని సందర్శించి ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.భద్రతా ఏర్పాట్లు లేని భవనాలకు సీలు వేయబడుతుంది. రేపటి నుంచి డిప్యూటీ కమిషనర్లందరూ తమ ప్రాంతాల్లోని భవనాలకు సంబంధించిన డేటాను సేకరిస్తారని జియో న్యూస్ పేర్కొంది.