Mahesh Babu : మహేష్ తో అనుకున్న మూవీ కి బ్రేక్ .. కారణం ఇదే ? సందీప్ వంగా వైరల్ కామెంట్స్ ..
మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే . అయితే సందీప్ రెడ్డి వంగా మహేష్ బాబుతో ఒక సినిమా చేయబోతున్నారంటూ ఆ మధ్య ఓ వార్త వినిపించింది.ఈయన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో కూడా తెరకెక్కించి
Mahesh Babu :మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే . అయితే సందీప్ రెడ్డి వంగా మహేష్ బాబుతో ఒక సినిమా చేయబోతున్నారంటూ ఆ మధ్య ఓ వార్త వినిపించింది.ఈయన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో కూడా తెరకెక్కించి సూపర్ హిట్టుని అందుకున్నారు. ఈ రెండు చిత్రాల తరువాత ఈ దర్శకుడు మహేష్ తో అనుకున్న మూవీ ని ప్రారంభించాలి అనుకున్నాడు . కానీ అది ఎందుకో సెట్ అవ్వలేదు. దీంతో సందీప్ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో ‘యానిమల్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది . ఈ ట్రైలర్ ఆడియన్స్ లో మంచి ఆదరణ పొందింది .ఈ ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది.
మహేష్ బాబుకి చెప్పిన కథ యానిమల్ మూవీనే అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి కథకి ఎలా నో చెప్పావు అన్నా అంటూ మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు వేస్తున్నారు. ఇక తాజాగా సందీప్ వంగా మహేష్ బాబు సినిమా గురించి కామెంట్స్ చేశారు. “మహేష్ బాబు గారికి ఓ కథ చెప్పాను. అది ఆయనకి కూడా నచ్చింది. అయితే వేరే కమిట్మెంట్స్ వలన అది ముందుకు వెళ్ళలేదు. కానీ భవిషత్తులో మహేష్ బాబు, రామ్ చరణ్ గారు ఇలా అందరితోనూ సినిమాలు చేయాలని ఉంది” అంటూ సందీప్ వంగా పేర్కొన్నారు.ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. కాగా సందీప్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రభాస్ చేయనున్నారు. ‘స్పిరిట్’ అనే టైటిల్ తో తెరకెక్కబోతున్న ఆ సినిమా నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ లో మొదలు కానుందట. ఈ మూవీ తరువాత అల్లు అర్జున్ తో ఒక మూవీ చేయాల్సి ఉంది. ఇక మహేష్ బాబు కూడా రాజమౌళి సినిమాతో మరో మూడు సంవత్సరాలు కమిట్ అయ్యి ఉన్నారు . దీని బట్టి చూస్తే మహేష్, సందీప్ వంగా కాంబినేషన్ లో సినిమా చూడాలంటే 2027 వరకు ఆగాల్సిందే. కాగా సందీప్ డైరెక్ట్ చేసిన యానిమల్ మూవీ డిసెంబర్ 1న రిలీజ్ కాబోతుంది.
ఇక మహేష్ సినిమా విషయానికి వస్తే ప్రిన్స్ మహేష్ బాబు, గురూజీ కాంబినేషన్ లో రానున్న గుంటూరు కారం మూవీ గురించి అందరికీ తెలిసిందే . గతంలో వీరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి . ఇక ఇప్పుడు ఈ మాటల మాంత్రికుడు మహేష్ తో మాస్ మసాలా ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నాడు . ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్ అభిమానులకు పూనకాలు తెప్పించాయి. సితార ఎంటర్టైన్మెంట్స్, హారికా హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు .