Last Updated:

Putin-Wagner: వెనక్కు తగ్గిన వాగ్నర్ గ్రూపు.. రష్యాలో చల్లారిన తిరుగుబాటు

Putin-Wagner:  తాను పెంచిపోషించిన పాము తననే కాటువెయ్యాలని చూసిందనే సామెంత చందంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏర్పాటు చేసిన వాగ్నర్ సైన్యం ఆఖరి వారిమీదే తిరుగుబాటుకు కాలు దువ్వింది. రష్యా రక్షణ మంత్రిపై యెవ్జెనీ ప్రిగోజిన్ తీవ్ర ఆరోపణలు చేశారు.

Putin-Wagner: వెనక్కు తగ్గిన వాగ్నర్ గ్రూపు.. రష్యాలో చల్లారిన తిరుగుబాటు

Putin-Wagner:  తాను పెంచిపోషించిన పాము తననే కాటువెయ్యాలని చూసిందనే సామెంత చందంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏర్పాటు చేసిన వాగ్నర్ సైన్యం ఆఖరి వారిమీదే తిరుగుబాటుకు కాలు దువ్వింది. రష్యా రక్షణ మంత్రిపై యెవ్జెనీ ప్రిగోజిన్ తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు రష్యన్ ఆర్మీ ప్రధాన కార్యాలయంపై దాడి చేయనున్నట్టు సంచలన నిర్ణయం ప్రకటించారు. దానితో రష్యాలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వాగ్నర్ సైన్యాన్ని లొంగిపోవాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని పుతిన్ బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఇంతటి సంచలనం సృష్టించిన వాగ్నర్ తిరుగుబాటు ఎట్టకేలకు చల్లబడింది. తిరుగుబాటు విషయంలో వాగ్నర్ గ్రూప్ వెనకడుగు వేసింది. మాస్కో వైపు తన దళాల్ని నడిపిస్తానంటూ శనివారం ప్రకటించిన వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. రష్యాలో రక్తపాతం నివారణకే ఇలా చేస్తున్నట్లు ప్రిగోజిన్ ప్రకటించారు. అయితే ఇందులో విశేషమేంటంటే రష్యాలో చెలరేగిన సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు రష్యా మిత్రదేశమైన బెలారస్ సహాయపడింది. బెలారస్ మధ్యవర్తిత్వంతోనే వాగ్నర్ గ్రూప్, రష్యా ప్రభుత్వం మధ్య సంధి కుదిరింది.

అంతా బెలారస్ మహిమ(Putin-Wagner)

బెలారస్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ లుకాషెంకో ఈ  ఇరు పక్షాల మధ్య మధ్యవర్తితం వహించి వారి మధ్య ఒప్పందాన్ని కుదిర్చారు. వాగ్నర్ ఫైటర్లపై విచారణ జరగదని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్  తెలిపారు. వారి వీరోచిత చర్యలను మేము ఎల్లప్పుడూ గౌరవిస్తామని ఆయన అన్నారు. ప్రిగోజిన్ పై రష్యా మోపిన తిరుగుబాటు సంబంధిత కేసుల్ని పుతిన్ ప్రభుత్వం వెనక్కి తీసుకునేందుకు సిద్ధమైంది. ప్రిగోజిన్ పై క్రిమినల్ కేసును కూడా ఉపసంహరించుకుంటామని క్రెమ్లిన్ శనివారం తెలిపింది. వాగ్నర్ గ్రూప్ తన స్థావరాలకు తిరిగి వచ్చేలా ఒప్పందం కుదిరింది. తిరుగుబాటులో పాల్గొనని వారిని రష్యన్ సైన్యంలో చేరడానికి కూడా అనుమతించారు. ఇలా మొత్తానికి రష్యాలో పుతిన్, వాగ్నర్ కి మధ్య రాజేసుకున్న చిచ్చు చల్లారిందింది.