Last Updated:

Israel: ఇజ్రాయెల్ సంచలన ప్రకటన.. హమాస్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ హతం

Israel: ఇజ్రాయెల్ సంచలన ప్రకటన.. హమాస్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ హతం

Israel says it has killed Hamas military intelligence chief in southern Gaza: ఇజ్రాయెల్ సంచలన ప్రకటన విడుదల చేసింది. హమాస్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ను హతం చేసినట్లు వెల్లడించింది. గాజాపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే దక్షిణ గాజాలో హమాస్ మిలిటరీ ఇంటెలిజెన్స్ అధిపతిని చంపినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.

 

హమాస్ నాయకుడు ఒసామా తబాష్ అని, ఆయనను ఐడీఎఫ్ దళాలు హతమార్చాయని తెలిపింది. ఒసామా తబాష్ తమ దాడుల్లోనే చనిపోయాడని, ఆయన ఉగ్రవాద సంస్థ నిఘా, లక్ష్యాత్మక యూనిట్ విభాగానికి కూడా అధిపతిగా వ్యవహరిస్తున్నాడని ఇజ్రాయెల్ తెలిపింది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు హమాస్ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయకపోవడం గమనార్హం.

 

ఇటీవల ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య తొలికాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. కాగా, ఈ ఒప్పందం కొనసాగించేందుకు ఉగ్రవాద సంస్థ తిరస్కరించడంతోనే దాడులు జరిగినట్లు అమెరికా ఐక్యరాజ్య సమతి భద్రతా మండలిలో పేర్కొంది. ఆ ఒప్పందం ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని తెలిపింది.

 

ఇదిలా ఉండగా, అంతకుముందు గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో సుమారు 500 మందికిపైగా చనిపోగా.. ,చాలా మంది గాయపడ్డారు, మృతుల్లో మహిళలు, చిన్నారులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కాల్పుల విరమణ ఒప్పందంను హమాస్ తిరస్కరించడంతోనే ఇలా జరిగిందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెల్లడించారు.