Home / Hamas
Israel, Hamas Reach Agreement To End Gaza War: పశ్చిమాసియాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ – హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. గాజాలో శాంతి స్థాపన కోసం ఇరు పక్షాలు అంగీకరించాయి. కాల్పుల విరమణ ఒప్పందం, బందీల విడుదలకు సంబంధించి మధ్యవర్తులకు తమ ప్రతినిధి బృందం అంగీకారం తెలిపిందని హమాస్ పేర్కొంది. ఈ విషయాన్ని ప్రముఖ వార్త ఏజెన్సీ రాయిటర్స్ పేర్కొంది. దీంతో 15 నెలలుగా జరుగుతున్న భీకర పోరాటానికి ముగింపు […]
Donald Trump warning to hamas: తాను అధ్యక్షుడిగా అధికార బాధ్యతలు చేపట్టకముందే హమాస్ చెరలో ఉన్న బంధీలను విడిచిపెట్టాలని అమెరికా భావి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. హమాస్‌ను హెచ్చరించారు. అలా జరగని పక్షంలో మిలిటెంట్ గ్రూప్ హమాస్‌కు నరకం చూపిస్తానంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. చెప్పింది చేయండి.. తాజాగా ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగోలో ట్రంప్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 20న తాను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నానని, ఈ లోగా హమాస్ వద్ద ఉన్న […]
ఇజ్రాయెల్ దళాల నేతృత్వంలోని సెంట్రల్ గాజాలో ఆదివారం జరిగిన వైమానిక దాడులకలో కనీసం 68 మంది మృతిచెందారు. వీరిలో 12 మంది మహిళలు మరియు ఏడుగురు పిల్లలు ఉన్నారు.ఉత్తర గాజాలోని హమాస్ యొక్క భూగర్భ సొరంగం నెట్వర్క్ నుండి బందిఖానాలో చంపబడిన ఐదుగురు ఇజ్రాయెలీ బందీల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్స్ (ఐడిఎఫ్) పేర్కొంది.
ఇజ్రాయెల్-హమాస్ ల మధ్య బందీల విడుదల ఒప్పందంలో భాగంగా హమాసా్ 13 మంది ఇజ్రాయెల్ పౌరులు, నలుగురు విదేశీయులను విడుదల చేసింది. దీని తరువాత ఇజ్రాయెల్ ఆదివారం 39 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయడం ప్రారంభించింది. ఇజ్రాయెల్ సంధి ఒప్పందం యొక్క నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ హమాస్ బందీల మార్పిడిని చాలా గంటలు ఆలస్యం చేసింది.
ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధానికి కాస్తా విరామం లభించింది. ఖతార్ మధ్యవర్తిత్వం అమల్లోకి వచ్చింది. వాస్తవానికి గురువారం నుంచి కాల్పుల విమరణ అమలు కావాల్సి ఉండగా.. కొన్ని సాంకేతిక పరమైన అంశాల వల్ల శుక్రవారానికి వాయిదా పడింది. ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ 39 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తుంది.
శనివారం రాత్రి సెంట్రల్ గాజా స్ట్రిప్‌లోని మాఘాజీ శరణార్థి శిబిరం వద్ద ఇజ్రాయెల్ వైమానిక దాడిలో కనీసం 51 మంది పాలస్తీనియన్లు, ఎక్కువగా మహిళలు మరియు పిల్లలు మరణించగా పలువురు గాయపడ్డారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్ ) శనివారం రాత్రంతా గాజాపై బాంబు దాడులు కొనసాగించింది. గాజా స్ట్రిప్ యొక్క ఉత్తర ప్రాంతంలో దాడులను తీవ్రతరం చేసింది.
ఉత్తర గాజా స్ట్రిప్‌లోని జబాలియా శరణార్థి శిబిరంపై మంగళ, బుధవారాల్లో రెండు రౌండ్ల ఇజ్రాయెల్ దాడుల్లో సుమారుగా 195 మంది పాలస్తీనియన్లు మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వ మీడియా కార్యాలయం పేర్కొంది.
హమాస్ ఉగ్రదాడిలో బందీ అయిన జర్మనీ యువతి షానీ లౌక్ మృతదేహాన్ని తాజాగా ఇజ్రాయెల్ గుర్తించింది. గాజాలోకి ప్రవేశించిన తమ దళాలు ఆ మృతదేహాన్ని గుర్తించినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. షాని కుటుంబం కూడా ఆమె మృతిని సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించింది.
గాజా స్ట్రిప్ ప్రాంగణంలో ఐక్యరాజ్యసమితి కార్యాలయాల నుండి శరణార్థుల కోసం ఉద్దేశించిన ఇంధనం మరియు వైద్య సామాగ్రిని హమాస్ దొంగిలించిందని యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనా రెఫ్యూజీస్ ఇన్ ది నియర్ ఈస్ట్ (UNRWA) తెలిపింది.
పలువురు ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా చేసిన హమాస్ తమ అధీనంలో ఉన్న ఒక యువతి వీడియోను విడుదల చేసింది. అందులో ఒక యువతి గుర్తు తెలియని ప్రదేశంలో వైద్య చికిత్స పొందుతున్నట్లు చూపించారు. సదరు యువతి తనను తాను షోహమ్కు చెందిన మియా షెమ్ అని పరిచయం చేసుకుంది.