Home / Gaza
Israel says it has killed Hamas military intelligence chief in southern Gaza: ఇజ్రాయెల్ సంచలన ప్రకటన విడుదల చేసింది. హమాస్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ను హతం చేసినట్లు వెల్లడించింది. గాజాపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే దక్షిణ గాజాలో హమాస్ మిలిటరీ ఇంటెలిజెన్స్ అధిపతిని చంపినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. హమాస్ నాయకుడు ఒసామా తబాష్ అని, ఆయనను ఐడీఎఫ్ దళాలు హతమార్చాయని తెలిపింది. […]
Israel launches airstrikes on Gaza: గాజాపై ఇజ్రాయెల్ మరోసారి వైమానిక దాడులకు పాల్పడింది. మంగళవారం తెల్లవారుజామున మొదలైన భీకర దాడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు 342 మంది పాలస్తీనీయులు మరణించినట్లు గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. మరణించిన వారిలో మహిళలు, చిన్నారులు ఎక్కువ మంది ఉన్నారు. అయితే, తమ దేశానికి చెందిన మిగిలిన 59 మంది బందీలను విడుదల చేయకపోతే గాజాపై దాడులు మరింత ముమ్మరం చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి […]
గాజాలోని రఫాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న కాల్పులు, వైమానిక దాడులతో 37 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. వారిలో ఎక్కువ మంది గుడారాలలో ఆశ్రయం పొందారు, రఫా యొక్క పశ్చిమ టెల్ అల్-సుల్తాన్ జిల్లాలో సోమవారం, మంగళవారం జరిగిన కాల్పుల్లో 16 మంది మరణించారని పాలస్తీనా సివిల్ డిఫెన్స్ మరియు పాలస్తీనా రెడ్ క్రెసెంట్ తెలిపారు.
గాజాలోని ఒక హోటల్ కింద హమాస్ సొరంగాలను కనుగొన్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్ )శనివారం తెలిపింది. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హోటల్ కింద AK-47 రైఫిల్స్, పేలుడు పదార్థాలు మరియు డ్రోన్లతో సహా అనేక ఆయుధాలను నిల్వ చేసిందని పేర్కొంది.
ఇజ్రాయెల్ దళాల నేతృత్వంలోని సెంట్రల్ గాజాలో ఆదివారం జరిగిన వైమానిక దాడులకలో కనీసం 68 మంది మృతిచెందారు. వీరిలో 12 మంది మహిళలు మరియు ఏడుగురు పిల్లలు ఉన్నారు.ఉత్తర గాజాలోని హమాస్ యొక్క భూగర్భ సొరంగం నెట్వర్క్ నుండి బందిఖానాలో చంపబడిన ఐదుగురు ఇజ్రాయెలీ బందీల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్స్ (ఐడిఎఫ్) పేర్కొంది.
గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో సుమారుగా 33 మంది మరణించారు. లెబనాన్ నుండి ఉత్తర ఇజ్రాయెల్ వైపు ప్రయోగించిన ఆరు రాకెట్లను అడ్డుకున్నామని, దాడిలో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు గాయపడ్డారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
ఉత్తర గాజా స్ట్రిప్‌లోని జబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ బాంబు దాడుల కారణంగా సుమారుగా 100 మంది మరణించగా మరో 100 మంది శిధిలాల కింద కూరుకుపోయారని గాజాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం పేర్కొంది.ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం 100 మందికి పైగా మరణించగా, శిథిలాల కింద 100 మంది చిక్కుకున్నారు. మరో 20 మంది గాయపడ్డారు.
గత వారం గాజా నుండి తరలించబడిన ఒక అమెరికన్ నర్సు యుద్ధం తో దెబ్బతిన్న గాజాలో తన అనుభవాలను వివరించింది, ఆహారం మరియు నీటి కొరత కారణంగా ఆమె మరియు ఆమె బృందం దాదాపు ఆకలితో చనిపోయే పరిస్దితికి వచ్చామని చెప్పింది. ఇజ్రాయెల్ నిరంతరం బాంబు దాడులు చేయడంతో శరీరాలపై తీవ్రమైన కాలిన గాయాలతో ఉన్న పిల్లలను తాను చూశానని ఆమె చెప్పింది.
ఉత్తర గాజా స్ట్రిప్‌లోని జబాలియా శరణార్థి శిబిరంపై మంగళ, బుధవారాల్లో రెండు రౌండ్ల ఇజ్రాయెల్ దాడుల్లో సుమారుగా 195 మంది పాలస్తీనియన్లు మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వ మీడియా కార్యాలయం పేర్కొంది.
గాజాపై వైమానిక దాడిలో టాప్ హమాస్ కమాండర్ ఇబ్రహీం బియారీ హతమైనట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ( ఐడిఎఫ్) బుధవారం ప్రకటించింది.ఐడిఎఫ్ ఫైటర్ జెట్లు హమాస్ సెంట్రల్ జబాలియా బెటాలియన్ కమాండర్ ఇబ్రహీం బియారీని హతమార్చాయి అక్టోబర్ 7న జరిగిన హంతక ఉగ్రవాద డికి కారణమైన నాయకులలో బియారీ ఒకరు అని ఐడిఎఫ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో పేర్కొంది.