Home / Israel-Hamas war
Hamas Political Leader and his Wife Killed In Israeli Airstrike In Gaza: గాజాపై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. గత కొంతకాలంగా హమాస్ సంస్థకు చెందిన రాజకీయ కీలక నేతల లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లిపోతోంది. తాజాగా, గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో కీలక రాజకీయ నేత సలాహ్ అల్ బర్దావీల్ మృతి చెందినట్లు తెలుస్తోంది. టెల్ అవీవ్ జరిపిన దాడుల్లో మరణించినట్లు హమాస్ వెల్లడించింది. ఈ దాడుల్లో మిలిటెంట్ […]
Israel says it has killed Hamas military intelligence chief in southern Gaza: ఇజ్రాయెల్ సంచలన ప్రకటన విడుదల చేసింది. హమాస్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ను హతం చేసినట్లు వెల్లడించింది. గాజాపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే దక్షిణ గాజాలో హమాస్ మిలిటరీ ఇంటెలిజెన్స్ అధిపతిని చంపినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. హమాస్ నాయకుడు ఒసామా తబాష్ అని, ఆయనను ఐడీఎఫ్ దళాలు హతమార్చాయని తెలిపింది. […]
గాజాపై ఇజ్రాయెల్ దాడులను మరింత ఉధృతం చేస్తోంది. తూర్పు రఫా ప్రాంతం నుంచి సుమారు లక్ష మంది పాలస్తీనియన్లు తాత్కాలికంగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించింది. హమాస్‌కు ఇది అత్యంత పటిష్టమైన ప్రాంతమని ఇజ్రాయెల్ వాదిస్తోంది.
హమాస్ - ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్నయుద్ధంలో ఒళ్లు జలదరించే అంశాలు వెలుగుచూస్తున్నాయి. గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడి చేసి తమ వెంట సుమారు వంద మంది మహిళలను బందీలుగా తీసుకువెళ్లారు. ప్రస్తుతం వారిలో కొంత మంది గర్భం దాల్చారు.
పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకర యుద్ధం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. హమాస్ అంతమే ధ్యేయంగా ఇజ్రాయెల్ సైన్యం ముందుకు వెళుతోంది. యుద్ధం మంగళవారం లెబనాన్ రాజధాని బీరూట్‌కు చేరుకుంది. ఈ దాడుల్లో హమాస్ డిప్యూటీ నాయకుడు సలేహ్ అల్-అరౌరీని హతమార్చినట్లు అధికారులు తెలిపారు. అరూరి అంగరక్షకులు కూడా మరణించారని వెల్లడించారు.
గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో గత 24 గంటల్లో 240 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ( ఐడీఎఫ్ ) సెంట్రల్ గాజాలో త మంగళవారం 100 ప్రాంతాలపై దాడి చేసినట్లు తెలిపింది.
ఇజ్రాయెల్ దళాల నేతృత్వంలోని సెంట్రల్ గాజాలో ఆదివారం జరిగిన వైమానిక దాడులకలో కనీసం 68 మంది మృతిచెందారు. వీరిలో 12 మంది మహిళలు మరియు ఏడుగురు పిల్లలు ఉన్నారు.ఉత్తర గాజాలోని హమాస్ యొక్క భూగర్భ సొరంగం నెట్వర్క్ నుండి బందిఖానాలో చంపబడిన ఐదుగురు ఇజ్రాయెలీ బందీల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్స్ (ఐడిఎఫ్) పేర్కొంది.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ( ఐడీఎఫ్ ) ఉత్తర గాజాలోని షెజాయా పరిసరాల్లో జరిగిన పోరాటంలో ముగ్గురు ఇజ్రాయెలీ బందీలపై పొరపాటున కాల్పులు జరిపినట్లు సైనిక ప్రతినిధి డేనియల్ హగారి శుక్రవారం తెలిపారు.షెజాయాలో జరిగిన పోరాటంలో ఐడీఎఫ్ పొరపాటున 3 ఇజ్రాయెలీ బందీలను శత్రువులుగా గుర్తించి కాల్పులు జరపడంతో బందీలు మరణించారు.
ఖతార్- మరియు ఈజిప్ట్ మధ్యవర్తిత్వ ఒప్పందం శుక్రవారం అమలులోకి వచ్చినప్పటి నుండి హమాస్ 50 మందికి పైగా ఇజ్రాయెల్ మహిళలు మరియు పిల్లలను విడుదల చేసారు. వారిలో 17 మంది థాయ్‌లాండ్ పౌరులు ఉన్నారు.అక్టోబరు 7న హమాస్ దాడుల్లో పట్టుబడిన 160 మందికి పైగా బందీలు ఇప్పటికీ గాజా స్ట్రిప్‌లో ఉన్నారు.
ఇజ్రాయెల్-హమాస్ ల మధ్య బందీల విడుదల ఒప్పందంలో భాగంగా హమాసా్ 13 మంది ఇజ్రాయెల్ పౌరులు, నలుగురు విదేశీయులను విడుదల చేసింది. దీని తరువాత ఇజ్రాయెల్ ఆదివారం 39 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయడం ప్రారంభించింది. ఇజ్రాయెల్ సంధి ఒప్పందం యొక్క నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ హమాస్ బందీల మార్పిడిని చాలా గంటలు ఆలస్యం చేసింది.