Last Updated:

కరోనా బీఎఫ్ 7 : కరోనా బీఎఫ్ 7 వేరియంట్ లక్షణాలు ఎలా ఉంటాయంటే ?

కరోనా బీఎఫ్ 7 : కరోనా బీఎఫ్ 7 వేరియంట్ లక్షణాలు ఎలా ఉంటాయంటే ?

Corona Bf 7 : కరోనా మళ్ళీ విజృంభిస్తుంది. ఇప్పటికే మూడు వేవ్ లను ఎదుర్కొన్న మరో మారు నాలుగో వేవ్ కి కూడా సిద్దంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. ప్రస్తుతం చైనాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే.  ఈ వ్యాప్తికి కారణంగా భావిస్తున్న కరోనా లో కొత్త వేరియంట్ ని గుర్తించారు. ఒమిక్రాన్‌ వేరియంట్ లోని ఉప వేరియంట్ కు చెందిన బీఎఫ్‌ 7 గా గుర్తించారు. దేశవ్యాప్తంగా ఈ రకానికి చెందిన కేసులు నాలుగు నమోదయ్యాయి. కొత్త వేరియంట్లపై పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలోనే ఈ వేరియంట్ లక్షణాలు గురించి ప్రత్యేక విశ్లేషణ మీకోసం…

బీఎఫ్ 7 వేరియంట్ లక్షణాలు…

  • ఒమిక్రాన్‌‌ బీఏ 5 కు చెందిన సబ్-వేరియంట్ బీఎఫ్‌ 7 .
  • దీనికి విస్తృత వేగంతో వ్యాప్తి చెందే లక్షణం ఉంది.
  • బలమైన ఇన్‌ఫెక్షన్‌ కలిగించే సామర్థ్యం ఉంది.
  • దీని ఇంక్యుబేషన్‌ వ్యవధి కూడా చాలా తక్కువ.
  • గతంలో వైరస్ బారిన పడి కోలుకున్నవారు, వ్యాక్సిన్‌ తీసుకున్న వారికీ కూడా ఇన్‌ఫెక్షన్‌ కలిగించే సామర్థ్యం దీనికి ఉందని నిపుణులు అంటున్నారు.
  • ఈ వేరియంట్‌ ఆర్వో(ఆర్‌ నాట్‌) 10 నుంచి 18.6గా ఉంది. అంటే ఒకరికి ఈ వేరియంట్‌ సోకితే వారి నుంచి కనిష్ఠంగా 10… గరిష్ఠంగా 18.6 మందికి వ్యాప్తి చెందుతుంది.
  • ఈ వేరియంట్‌ బారినపడ్డ వారిలో జ్వరం, దగ్గు, గొంతు గరగర, జలుబు, నీరసం, విపరీతంగా ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
  • అతి కొద్ది కేసుల్లో వాంతులు, డయేరియా వంటి ఉదర సంబంధ వ్యాధుకు గురికావచ్చని తెలిపారు.
  • టీకాలు తీసుకోనివారు లేదా వ్యాధినిరోధక తక్కువగా ఉండే వృద్ధులు, పిల్లలు, గర్భిణి మహిళలు, పలు అనారోగ్య సమస్యలతో (కేన్సర్, నియంత్రణలేని చక్కెర వ్యాధి, కార్డియాక్ లేదా కిడ్నీ వ్యాధులు) బాధిపడుతున్నవారు ఈ వేరియంట్ బారిపడితే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
  • చైనాతో పాటు అమెరికా, బ్రిటన్‌, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్‌, డెన్మార్క్‌ వంటి ఐరోపా దేశాల్లోనూ ఈ వేరియంట్‌ కేసులు ఇప్పటికే వెలుగు చూశాయి

ఈ మేరకు ప్రజలంతా మాస్క్‌లు ధరించడం, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం వంటివి పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు బూస్టర్ డోస్ తీసుకోవడం వల్ల మరణాలు, కొత్త వేరియంట్లు ముప్పు నుంచి తప్పించుకోవచ్చని అంటున్నారు. ప్రజలు కూడా పలు జాగ్రత్తలు తీసుకొని  అప్రమత్తంగా ఉండాలని మనవి.

ఇవి కూడా చదవండి: