Published On:

Covid 19: కరోనాను గుర్తించండి ఇలా.. మామూలు జలుబుకు కరోనాకు తేడాలివే.!

Covid 19: కరోనాను గుర్తించండి ఇలా.. మామూలు జలుబుకు కరోనాకు తేడాలివే.!

Covid 19: కోవిడ్ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఈ పేరు వింటేనే వణుకుపుట్టే పరిస్థితి కనిపిస్తోంది, ఎందుకంటే వర్షాకాలం సీజన్ లో మామూలు ప్లూ ( జలుబు, సర్దీ) కూడా జనాలను కలవర పెడుతోంది ఎందుకంటే రెండు కూడా ఒకేలా కనిపిస్తాయి. ఇప్పుడు జలుబు చేసిన వ్యక్తికి అది మామూలు ఫ్లూ వచ్చిందా లేకుంటే కరోనా వచ్చిందా అని తెలుసుకోవడవ కష్టంగా మారుతోంది. ఇప్పుడు ఆ తేడాలను ఎలా గుర్తించాలో చూద్దాం.

 

 

కోవిడ్ కేసులు దేశవ్యాప్తంగా 3వేలకు చేరుకున్నాయి. కేరళలో మొదలైన కేసులు ఇప్పుడు దేశవ్యాప్తంగా నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోను ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో రెండు వార్డులను కోవిడ్ కోసం కేటాయించారు. అటు ఏపీలో కూడా కాకినాడా, వైజాగ్ లాంటి నగరాలలో కరోనాపై అప్రమత్తంగా ఉన్నారు. వర్షాకాలం మొదలవడంతో ఇప్పుడు జలుబు సమస్యలు మామూలుగానే మొదలవుతాయి. అయితే కోవిడ్ లక్షణాలు, జలుబు లక్షణాలు ఒకటే విధంగా ఉండటంతో కరోనా వచ్చిందా జలుబు వచ్చిందా అనే అనుమాణాలు కలుగుతాయి. సీజనల్ వ్యాదుల్లో జలుబు (సర్ది), జ్వరం, ఒళ్లునొప్పులు ఉంటాయి. అయితే ఈ లక్షణాలే కరోనాలో కూడా ఉంటాయి.

 

 

సాధారణంగా జలుబు చేసినప్పుడు గొంతునొప్పి, పొడి దగ్గు, నీరసం, తలనొప్పితో పాటు మరికొందరిలో డయేరియా కూడా వస్తుంది. కోవిడ్ సోకితే ఇలాంటి లక్షణాలే కనపడతాయి. అయితే కోవిడ్ కు టెస్ట్ చేస్తే తప్పా నిర్ధారించలేము. కోవిడ్ లో కొత్తవేరియంట్ వేగంగా సోకుతుంది. ఇది ఇమ్మునిటీపై కూడా ప్రభావం చూపెడుతుంది. ముఖ్యంగా కోవిడ్ కు మామూలు జలుబు ( ఫ్లూ, సర్ది) కి తేడా తెలుసుకోవాలంటే ఆక్సీజన్ సాచురేషన్ మంచి ఉదాహరణ. ఎవరికైతే పై లక్షణాలన్నీ ఉండి ఆక్సీజన్ సరిగ్గా అందడం లేదో వారికి కరోనా సోకినట్లు నిర్ధారించవచ్చు. పైగా రుచి వాసన కోల్పోయినట్లయితే కరోనాగా నిర్థారించుకోవచ్చు.

 

 

కోవిడ్ కనుక సోకినట్లయితే పై లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వైరస్ సోకిన మూడు నాలుగు రోజుల తర్వాత సింప్టమ్స్ కనిపిస్తాయి. ఇవి 14రోజుల వరకు కొనసాగే అవకాశం ఉంది. ఇక ఫ్లూ మాత్రం కొన్ని రోజులు ఉండి సాధారణంగా మారిపోతారు. ఎక్కువరోజులు ఫ్లూ ఉండి ఊపిరితీసుకోవడం కష్టంగా ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. కోవిడ్ ని టెస్ట్ చేసి నిర్థారించుకోవాలి. ముంగానే జాగ్రత్తపడటం మంచిది. మామూలు ఫ్లూ అయితే వారంరోజుల్లో తగ్గిపోతుంది.

ఇవి కూడా చదవండి: