Last Updated:

Bangladesh: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అవామీ లీగ్ ఘన విజయం

బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలలో అవామీ లీగ్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ప్రధాని షేక్ హసీనా రికార్డు స్థాయిలో వరుసగా నాలుగోసారి విజయం సాధించారు.ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) మరియు దాని మిత్రపక్షాలు ఈ ఎన్నికలను బహిష్కరించాయి.

Bangladesh: బంగ్లాదేశ్  సార్వత్రిక ఎన్నికల్లో అవామీ లీగ్  ఘన విజయం

Sheikh Hasina: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలలో అవామీ లీగ్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ప్రధాని షేక్ హసీనా రికార్డు స్థాయిలో వరుసగా నాలుగోసారి విజయం సాధించారు.ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) మరియు దాని మిత్రపక్షాలు ఈ ఎన్నికలను బహిష్కరించాయి.

అత్యధిక కాలం ప్రధానిగా..(Sheikh Hasina)

ఈ విజయంతో బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా హసీనా నిలిచారు.పోలింగ్ బూత్‌లు, పాఠశాలలకు నిప్పు పెట్టడంతోపాటు అక్కడక్కడా హింసాత్మక ఘటనలు జరిగాయి.300 స్థానాలున్న బంగ్లాదేశ్ పార్లమెంట్‌లో హసీనా పార్టీ ఇప్పటివరకు 224 గెలుచుకుంది, రెండు స్థానాల్లో ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 298 సీట్ల ఫలితాలు వెలువడ్డాయి. 62 నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు దక్కాయి. జాతియో పార్టీ నాలుగు స్థానాలను గెలుచుకుంది. ఒక సీటు మరో పార్టీ గెలుచుకుంది.మేము ఇప్పటికే అందుబాటులో ఉన్న ఫలితాలతో అవామీ లీగ్ విజేతగా ప్రకటిస్తాము. అయితే మిగిలిన నియోజకవర్గాలలో ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత తుది ప్రకటన చేయబడుతుందని ఎన్నికల సంఘం మీడియాతో అన్నారు.హసీనా 1986 నుండి గెలుస్తూ వస్తున్న గోపాల్‌గంజ్-3 స్థానం నుండి ఎనిమిదోసారి విజయం సాధించారు. ఆమె 2,49,965 ఓట్లను సాధించగా, బంగ్లాదేశ్ సుప్రీం పార్టీ నుండి ఆమె సమీప ప్రత్యర్థి ఎం నిజాం ఉద్దీన్ లష్కర్ కేవలం 469 ఓట్లు మాత్రం సాధించారు.

బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్పీ) 2014 ఎన్నికలను కూడా బహిష్కరించింది. ఈసారి బీఎన్పీతో పాటు, 15 ఇతర రాజకీయ పార్టీలు ఎన్నికలను బహిష్కరించాయి.తమ బహిష్కరణ ఉద్యమం విజయవంతమైందనడానికి పోలింగ్ శాతం తక్కువగా ఉండడమే నిదర్శనమని ప్రతిపక్ష పార్టీ నేతలు పేర్కొన్నారు. శాంతియుత ప్రజాస్వామిక నిరసన కార్యక్రమాలు వేగవంతం అవుతాయని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజల ఓటు హక్కును నెలకొల్పుతామని వారు తెలిపారు.