Published On:

Trump Pauses Immigration Arrests: అక్రమ వలసదారుల అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు.. వెనక్కి తగ్గిన ట్రంప్!

Trump Pauses Immigration Arrests: అక్రమ వలసదారుల అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు.. వెనక్కి తగ్గిన ట్రంప్!

Trump Pauses Immigration Arrests: అక్రమ వలసదారుల అరెస్టులకు ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. వలస సేవలు, సుంకాల విభాగం అధికారులు అరెస్టు చేయడానికి వ్యతిరేకంగా అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా అరెస్టుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

 

వలసదారులు ఎక్కువగా పనిచేస్తున్న ఏంజెలెస్‌లో వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం కలుగకుండా త్వరలో ఓ ఉత్తర్వును జారీ చేస్తానని ట్రంప్‌ ఇటీవల పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలోని వ్యవసాయ పరిశ్రమలు, హోటళ్లు, రెస్టారెంట్లల్లో సోదాలు నిలిపివేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలు మీడియాల్లో కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లోని సీనియర్‌ అధికారి వ్యవసాయ పరిశ్రమలు, హోటళ్లలో తనిఖీలు నిలిపివేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికార ప్రకటన వెలువడలేదు.

 

అక్రమ వలసదారులను అరెస్టు చేసేందుకు ఐసీఈ అధికారులు ఈ నెల 6వ తేదీన లాస్ ఏంజెలెస్‌లోని డౌన్‌టౌన్‌లో సోదాలు ప్రారంభించారు. దీంతో నిరసనలు ప్రారంభమయ్యాయి. అనంతరం నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. దీంతో లాస్‌ఏంజెలెస్‌లో ట్రంప్‌ భారీస్థాయిలో నేషనల్‌ గార్డ్‌లను మోహరించారు. ఈ క్రమంలోనే ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రం అయ్యాయి. నిరసనకారులను అడ్డుకునేందుకు 2వేల మంది నేషనల్‌ గార్డులను మోహరించాలని ట్రంప్ ఆదేశాలు జారీచేశారు. చర్యను కాలిఫోర్నియా గవర్నర్‌ గవిన్‌ న్యూసమ్, లాస్‌ ఏంజెలెస్‌ మేయర్‌ కరెన్‌ బాస్‌తో సహా స్థానిక పోలీసులు వ్యతిరేకించారు. గవిన్‌ దీనిపై ఫెడరల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా, అధ్యక్షుడి ఆదేశాలు చెల్లవని కోర్టు తేల్చిచెప్పింది.

 

ఇవి కూడా చదవండి: