Home / italy
ఇటలీ ట్రిబ్యునల్ సోమవారం మాదకద్రవ్యాల అక్రమ రవాణా సమూహాలలో ఒకటైన ఇటలీలోని ndrangheta లో సభ్యత్వం కలిగిన 207 మందిని దోషులుగా నిర్ధారించి వారికి 2,100 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.ఈ కేసుకు సంబంధించి మరో 131 మంది నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది.
ఇటలీలోని లాంపెడుసా ద్వీపం వద్ద జరిగిన ఓడ ప్రమాదంలో 41 మంది వలసదారులు మరణించారు. ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ నలుగురు వ్యక్తుల బృందం ఈ విషయాన్ని వెల్లడించారు. ట్యునీషియాలోని స్ఫాక్స్ నుండి బయలుదేరిన పడవలో ఉన్నారని ఇటలీకి వెళుతుండగా మునిగిపోయారని వారు చెప్పారు. ప్రమాద సమయంలో ఓడలో ముగ్గురు పిల్లలతో సహా 45 మంది ఉన్నారు.
గత నెలలో మరణించిన ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ 100 మిలియన్ యూరోలను (రూ. 9,05,86,54,868) తన 33 ఏళ్ల స్నేహితురాలు మార్టా ఫాసినాకు తన వీలునామాలో రాసినట్లు గార్డియన్ నివేదించింది. మూడు సార్లు ఇటాలియన్ ప్రధాన మంత్రి సామ్రాజ్యం విలువ 6 బిలియన్ యూరోల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా.
ఇటలీ నీటి నగరం వెనిస్లో ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇక్కడ ఎప్పుడూ పర్యాటకులతో కిటకిటలాడే వెనిస్ నగరం గ్రాండ్ కెనాల్ నీటి రంగు.. రాత్రికి రాత్రే మొత్తం ఆకుపచ్చగా మారిపోయింది. కాలువ రంగు మారిపోవడంతో అక్కడి ప్రజలంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇది గమనించిన కొందరు స్థానికులు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
భారీ వర్షాలకు ఉత్తర ఇటలీలో నదులు పొంగిపొర్లి పట్టణాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. వునా నది పొంగిపొర్లడంతో ఉత్తర క్రొయేషియాలోని కొంత భాగంతో పాటు వాయువ్య బోస్నియాలోకి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. దీంతో అక్కడి అధికారులు ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చింది.
ఇటలీలో జననాల రేటు రికార్డు స్దాయిలో తగ్గింది. నేషనల్ స్టాటిస్టిక్స్ బ్యూరో ISTAT సమర్పించిన కొత్త నివేదిక ప్రకారం, 2022లో ప్రతి 1,000 మంది నివాసితులకు 7 కంటే తక్కువ నవజాత శిశువులతో ఇటలీలో జననాల రేటు చారిత్రాత్మకంగా కనిష్ట స్థాయికి చేరుకుంది. జనాభా 179,000 తగ్గి 58.85 మిలియన్లకు చేరుకుంది.
దక్షిణ ఇటాలియన్ తీర నగరమైన క్రోటోన్‌లో ఆదివారం సముద్రంలో ఓవర్‌లోడ్ చేయబడిన పడవ మునిగిపోవడంతో ఒక చిన్న శిశువుతో సహా 40 మంది వలసదారులు మరణించారని ఇటాలియన్ మీడియా తెలిపింది.
గత ఏడాది యూరప్‌లో ఎండలు ఠారేత్తించాయి. ఈ ఏడాది కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఇటలీలో కరువు చాయలు కనిపిస్తున్నాయి.
ఇటలీ తొలి మహిళా ప్రధానిగా జియార్జియా మెలోని బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. నేషనలిస్ట్ బ్రదర్స్ పార్టీ నేత అయిన మెలోని, ఆదివారం జరిగిన జాతీయ ఎన్నికల్లో ఆధిక్యాన్ని సాధించారు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ విషయాన్ని వెల్లడించాయి.
అక్కడి ప్రభుత్వమే ప్రజలకు ఫ్రీగా ఇళ్లుకట్టుకోవడానికి కావాల్సిన డబ్బును ఇస్తాం అని ప్రకటించింది. అసలు ఎందుకు అంత డబ్బు ఇస్తానని చెప్పింది.? అది ఎక్కడి ప్రభుత్వం.? అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ కథనం చదివెయ్యండి.