Assembly Bypoll Result 2025: బీజేపీకి షాక్ ఇచ్చిన ఆప్.. 17వేల మెజార్టీతో విక్టరీ!

Assembly Bypoll Result 2025 AAP wins Gujarat’s Visavada: దేశంలోని 4 రాష్ట్రాల్లో 5 అసెంబ్లీ స్థానాలకు జూన్ 19వ తేదీన ఉపఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ ఫలితాల్లో బీజేపీకి ఆప్ షాక్ ఇచ్చింది. గుజరాత్‌లోని విసావదర్ స్థానాన్ని ఆప్ కైవసం చేసుకుంది. కాడి సీటును మాత్రమే బీజేపీ దక్కించుకుంది.
విసావదర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి కిరీట్ పాటిల్ పై ఆప్ అభ్యర్థి గోపాల్ ఇటాలియా 17వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఓటింగ్‌లో గోపాల్ కు 75 వేల ఓట్లు పోలవ్వగా.. పటేల్ కు మాత్రం 58 ఓట్లే పడ్డాయి. కాగా, అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఎమ్మెల్యేగా గెలిచిన భూపేంద్ర రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో ఈ నియోజకవర్గంలో ఉపఎన్నికల అనివార్యమైంది.
ఇక, కేరళలోని నీలాంబుర్ నియోజకవర్గంలోకాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి విజయం సాధించారు. పంజాబ్ లోని లూథియానా వెస్ట్ స్ఘానాన్ని ఆప్ సొంతం చేసుకుంది. చివరగా, పశ్చిమ బెంగాల్ లోని కాళిగంజ్ స్థానాన్ని టీఎంసీ గెలిచింది.