Liger Movie Controversy: వివాదంలో ’లైగర్‘
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘లైగర్’. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమాను ఆగస్ట్ 25న పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.
Liger Movie Controversy: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘లైగర్’. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమాను ఆగస్ట్ 25న పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. సినిమా ప్రమోషన్స్ చాలా స్పీడుగా జరుగుతున్నాయి.
ఈ టైమ్‌లో ‘లైగర్’ మూవీపై కొందరు నెటిజన్స్ నెగిటివ్ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. అందుకు కారణం విజయ్ దేవరకొండనే అని వారు చెబుతుండటం కొసమెరుపు. బాయ్ కాట్ లైగర్ అన్న హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ట్రెండ్ వెనక ఉన్నదెవరు అసలు కారణాలు ఏంటి? ఈ మధ్య కాలంలో బాయ్‌కాట్ బాలీవుడ్ అనే దాని గురించి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా ఖాన్స్‌కి సంబంధించిన సినిమాల విషయంలో ఈ ప్రమోషన్స్ ఎక్కువగా ఉన్నాయి. అమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ సహా కరణ్ జోహార్, కరీనా కపూర్, అక్షయ్ కుమార్, అనురాగ్ కశ్యప్ వంటి చాలా మంది సెలబ్రిటీలు బాయ్‌కాట్ బాలీవుడ్ అనే ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్‌తో ఇబ్బంది పడ్డవారే. బాయ్‌కాట్ బాలీవుడ్. ఇండియాలో ట్రెండింగ్ లో ఉన్న హ్యాష్‌ట్యాగ్. ఇప్పటికే వరుస ఫెయిల్యూర్లతో ఉన్న బాలీవుడ్ ను బాయ్‌కాట్ హ్యాష్‌ట్యాంగ్ మరింత టెన్షన్ పెడుతోంది. ఆమీర్ లాల్‌సింగ్ చడ్డా దగ్గర నుంచి అక్షయ్ రక్షాబంధన్, షారుఖ్ పఠాన్, ఇలా టాప్ హీరోలే లక్ష్యంగా రోజుకో హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వస్తోంది. తాజాగా ఆ సెగ లైగర్ చిత్రానికి కూడా తగులుతోంది.
అయితే తాజాగా ‘లైగర్’ సినిమా ప్రమోషన్స్‌కు సంబంధించిన ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడారు. లాల్ సింగ్ చడ్డా అనేది అమిర్ ఖాన్ సినిమాలో పోషించిన పాత్ర పేరు. ఆయనొక్కడిదే సినిమా కాదు. దానిపై దాదాపు రెండు నుంచి మూడు వేల కుటుంబాలు ఆధారపడ్డాయన్నారు. చాలా మంది సినీ కార్మికులు ఇలా సినిమాని బోయ్ కాట్ చేయటం వలన నష్టపోతారని అన్నారు విజయ్‌దేవరకొండ. అయితే, సినిమా రిలీజ్ కు ముందే వాళ్లకు పేమెంట్ ఇచ్చేస్తారు కదా..వాళ్లు నష్టపోయేదేముంది. ఇలా అమీర్ ఖాన్ ని సపోర్ట్ చేయటానికి సంబంధం లేని లాజిక్ లు తీస్తున్నారని కొందరు బాయ్‌కాట్ పిలుపు ఇస్తున్నారు. అమిర్ ఖాన్‌కి విజయ్ దేవరకొండ సపోర్ట్ చేయటంతో లైగర్‌పై కూడా నెగిటిల్ ట్రోలింగ్స్ స్టార్ట్ అయ్యాయి. విజయ్ దేవరకొండ, కరణ్ జోహార్ బ్యానర్లో లైగర్ సినిమా చేయటంతో బ్యాన్ చేస్తున్నామని ఒకరంటే, అతనికి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో తెలియదంటూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. ఈ కారణాలతో లైగర్ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ బాయ్‌కాట్ లైగర్ పేరుతో సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. హీరోయిన్ అనన్యా పాండే. సీనియర్ యాక్టర్ చుంకీ పాండే కుమార్తెగా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యారు. ఆమెకు కరణ్ జోహార్ ఆశీసులు కూడా ఉన్నాయి. ఇక ఆమెపై కోపం కూడా సినిమా మీదకు మళ్లిందని చెప్పవచ్చు. అంతేనా, అనన్యాపాండే డ్రగ్ అడిక్ట్ అని కూడా నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి కారణం కరణ్ జోహార్ వంటి దర్శక నిర్మాతలు అంటూ పెద్ద ఎత్తున ట్రోల్స్ జరిగాయి. కరణ్ జోహార్ బయట నుంచి వచ్చిన వారిని ప్రమోట్ చేయకుండా కేవలం సినీ పరిశ్రమలో పాతుకుపోయిన వారి పిల్లలను ప్రమోట్ చేస్తున్నారనే విషయం మీద పెద్ద ఎత్తున నెటిజన్లు గతంలో ఫైర్ అయ్యారు.
అంతేకాకుండా విజయ్ దేవరకొండ రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన ఓ ప్రెస్ మీట్ లో టేబుల్ కాళ్లు పెట్టి కూర్చోవటాన్ని కూడా ఆడియన్స్ ని తక్కువ చేసి చూస్తున్నాడని కొందరు వేలెత్తి చూపుతు, బోయ్ కాట్ ట్రెండ్ ని సపోర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తు అయితే రీసెంట్ గా విజయ్ దేవరకొండ టూర్ పూర్తయ్యాక ఇంట్లో పూజలు జరిపించుకున్నారు. ఆ పూజ ఫొటోలు ట్వీట్ చేసారు. అవి చూసిన జనం పూజ చేయటానకి వచ్చిన ముగ్గురు అర్చకులు నిలబడి ఉంటే విజయ్, హీరోయిన్ మాత్రం సోఫాలో కూర్చున్నారని బోయ్ కాట్ కి పిలుపు ఇస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే సినిమాలో ‘ఆ ఫట్’, ‘అకిడి పకిడి’ పాటలపై కూడా నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. ‘ఆ ఫట్’ పాటలో హిందీ లిరిక్స్ అనేవి వివాదానికి కారణం అయ్యాయి. హిందీలో 70లలో వచ్చిన ఒక సినిమాలోని రేప్ సన్నివేశంలో డైలాగులను ఫన్నీగా ఉపయోగించారని ఒకరు దీని గురించి ట్వీట్ చేశారు. మరి కొంత మంది కూడా లిరిక్స్ మీద అనేక రకాల విమర్శలు చేస్తున్నారు. బాయ్‌కాట్ పిలుపునకు ఇదొక కారణం అని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కరణ్ జోహార్ సహ నిర్మాణంలో రూపొందిన లైగర్ సినిమాను బ్యాన్ చేయాలంటూ బాలీవుడ్లో ప్రచారం మొదలు పెట్టడంతో యూనిట్ లో టెన్షన్ నెలకొంది. తాజాగా ఇదే విషయం మీద దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా స్పందించారు. అసలు ఈ ట్రెండ్ ఎవరు సృష్టిస్తున్నారో తెలియడం లేదని, మేము సినిమాలు చేసినా, కథలు రాసుకున్నా అవన్నీ జనాన్ని ఎంటర్టైన్ చేయడం కోసమే అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈ బాయ్‌కాట్ అనేది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో తెలియడం లేదన్నారు. ఇది సినీ పరిశ్రమకు కరెక్ట్ కాదని పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చారు. అటు విజయ్‌దేవరకొండ ఫ్యాన్స్ కూడా పాజిటివ్ ట్వీట్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. అన్‌స్టాపబుల్ లైగర్ అంటూ ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. మొత్తం మీద సినిమా యూనిట్ అయితే బాయ్ కాట్ ట్రెండ్‌తో టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది. మరోవైపు ఈ ట్రెండ్‌కి వ్యతిరేకంగా, దేశవ్యాప్తంగా విజయ్ అభిమానులు #ISupportLiger ట్రెండింగ్‌లో ఉన్నారు . ఈ హ్యాష్‌ట్యాగ్ టాప్ ఎట్ నంబర్ వన్ పొజిషన్లో ట్రెండ్ అవుతోంది.