Published On:

Varun Tej: గుడ్‌న్యూస్‌.. తండ్రి కాబోతున్న మెగా హీరో వరుణ్‌ తేజ్‌!

Varun Tej: గుడ్‌న్యూస్‌.. తండ్రి కాబోతున్న మెగా హీరో వరుణ్‌ తేజ్‌!

Is Lavanya Tripathi Pregnant?: టాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌లో వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి జంట ఒకటి. కొన్నేళ్లు సీక్రెట్‌గా ప్రేమ వ్యవహారం నడిపిన ఈ జంట 2023 నవంబర్‌ 1న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లయిన రెండేళ్లు కావోస్తోంది. దీంతో ఈ మెగా కపుల్‌ నుంచి ఎప్పుడెప్పుడు గుడ్‌న్యూస్‌ వస్తుందా? అభిమానులు, కుటుంబసభ్యులంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు వారందరికి ఆనందపరిచే ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్‌ అంటూ ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

తండ్రి కాబోతోన్న వరుణ్?

అంతేకాదు సినీ పీఆర్‌ఓల నుంచి వరుణ్‌ తేజ్‌ దంపతులు శుభాకాంక్షలు వస్తున్నాయి. దీంతో వరుణ్‌ తేజ్‌ త్వరలోనే తండ్రి కాబోతున్నాడా? అనే అభిప్రాయాలు వస్తున్నాయి. దేవీ ప్రియ అనే పీఆర్‌ఓ వరుణ్ తేజ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ట్వీట్‌ చేసింది. దీంతో వరుణ్‌-లావణ్యలు తల్లిదండ్రులు కాబోతున్నారా? త్వరలోనే గుడ్‌న్యూస్‌ చెప్పున్నున్నారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరైతే బాబా? పాప? అంటూ కామెంట్స్‌. మొత్తానికి ఈ ట్వీట్‌తో లావణ్య ప్రెగ్నెంట్‌ ప్రస్తుతం ఈ వార్తలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే మెగా కుటుంబం నుంచి ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చేవరకు వెయిట్‌ చేయాల్సిందే.

 

మిస్టర్ సినిమాతో ప్రేమలో..

కాగా వరుణ్‌ తేజ్‌ లావణ్య త్రిపాఠిలు మిస్టర్‌ మూవీలో తొలిసారి జంటగా నటించారు. అదే టైంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత అంతరిక్షం సినిమాలో మరోసారి వీరిద్దరు జతకట్టారు. నాలుగేళ్ల రిలేషన్‌ వీరు సీక్రెట్‌గా ప్రేమ వ్యవహరం నడిపారు. ఎన్నోసార్లు వీరిద్దరి రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. ఎప్పుడు ఈ వీటిపై స్పందించలేదు. ఆరేళ్లు ప్రేమలో మునిగితేలిన వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. నవంబర్‌ 1, 2023న ఇటలీ వరుణ్‌-లావణ్యల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

 

ఇరు కుటుంబ సభ్యుల సమయంలో వీరిద్దరు ఏడడుగులు వేసి ఒక్కటయ్యారు. ఇక పెళ్లి తర్వాత లావణ్య ఇప్పటి వరకు ఏ సినిమాకు కమిట్‌ కాలేదు. దీంతో ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పుబోతుందనే రుమర్స్‌ వచ్చాయి. కానీ, త్వరలోనే వెండితెరపై రీఎంట్రీ ఇస్తానంటూ లావణ్య పలు ఇంటర్య్వూలో స్పష్టం చేశారు. అదే టైంలో లావణ్య గర్భం దాల్చిందనే వార్తలు బయటకు రావడం గమనార్హం. కాగా వరుణ్‌ తేజ్‌ చివరిగా మట్క మూవీలో నటించాడు. పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజై ఈ సినిమా ఫస్ట్‌డే భారీ డిజాస్టర్‌గా నిలిచింది.