Published On:

Exercise – Heart Attack: అధిక వ్యాయామం చేస్తున్నారా.. హార్ట్ ఎటాక్ వస్తుందట..!

Exercise – Heart Attack: అధిక వ్యాయామం చేస్తున్నారా.. హార్ట్ ఎటాక్ వస్తుందట..!

High Exercise Cause Heart Attack: గుండెపోటు వలన ఎక్కువ మంది చనిపోతున్నారని నివేధికలు తెలుపుతున్నాయి.  అధికశ్రమ వలన గండె పోటు వస్తుందంటున్నారు.  హృదయ సంబంధ వ్యాధుల వల్ల సంభవించే మొత్తం మరణాలలో 85% గుండెపోటు వలనే జరుగుతున్నాయి.  హార్ట్ ఎటాక్ ఎందుకు వస్తుందని పరిశోధించినపుడు ఆశ్చర్యపడే విషయాలు తెలిశాయి. గుండెపోటు వచ్చిన వారిలో అధిక శారీరక శ్రమ చేయడం వలన హార్ట్ ఎటాక్ వచ్చినట్లు తేలింది. అధిక శారీరక శ్రమ గుండెపోటును ఎలా ప్రేరేపిస్తుందో వైద్యులు వివరిస్తున్నారు.

 

గుండెపోటు అనేది గుండెకు రక్త ప్రవాహం తీవ్రంగా తగ్గడం లేదా పెరగడం చేత వస్తుంది. ఇది సాధారణంగా గుండె లోపల ఉన్న కరోనరీ ధమనులలో కొవ్వు, కొలెస్ట్రాల్ మరియు ఇతర పదార్థాలు పేరుకుపోవడం వల్ల జరుగుతుంది. ఒక ప్లేక్ పగిలిపోయి రక్త ప్రవాహాన్ని అడ్డుకునే గడ్డను ఏర్పరుస్తుంది. (కొవ్వు, కొలెస్ట్రాల్ కలిగిన వాటిని ప్లేక్స్ అంటారు ) ఇది చివరికి గుండెపోటుకు కారణమవుతుంది.

 

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WH0) ప్రకారం ప్రతీ సంవత్సరం గుండె జబ్బులతో 17.9 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారని అంచనా. ఇందులో 85% గుండెపోటు మరియు స్ట్రోక్ కారణంగా మరణాలు సంభవించాయి.

 

గుండె జబ్బులను నివారించడానికి మార్గాలను అందిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా గుండె జబ్బులను నివారించడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయడం ఉత్తమ మార్గాలలో ఒకటి. అయితే కఠినమైన వ్యాయామాలు చేస్తున్నవారికి హృదయ సంబంధ వ్యాధులు ఉన్నట్లయితే ఊహించని ప్రమాదం ఎదురవుతుంది. కాబట్టి గుండె వ్యాధులు ఉన్నవారు తేలికపాటి వాకింగ్ లాంటివి చేయాలి.

 

మెరుగైన ఆక్సిజన్.. 

ఒక వ్యక్తి వ్యాయామం ఎక్కువగా చేసినప్పుడు, ఆక్సిజన్ ఎక్కువగా తీసుకుంటాడు. శ్వాసిస్తున్నప్పుడు.. గుండె లోని ధమనులు తగినంత ఆక్సీజన్ ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాకపోతే గుండె నాళాల్లో అథెరోస్క్లెరోసిస్ ఫలితంగా ధమనులు మూసుకుపోయి ఉంటాయి. దీంతో గుండెకు తగినంత ఆక్సీజన్ లభించదు. దీంతో హార్ట్ ఎటాక్ సంభవించవచ్చు.

 

గుండెకు రక్తప్రసరణ ఎక్కువైనా హార్ట్ ఎటాక్ వస్తుంది. అధిక శారీరక శ్రమ వలన తీవ్రఒత్తిడి ఏర్పడుతుంది. ఇది గుండెపై అధిక ఒత్తిడి కలిగిస్తుంది. దీని వలన ధమనులు చిట్లిపోతాయి. అందులోనుంచి రక్తం బయటకు వచ్చే అవకాశం ఉంది.

 

గుండె పోటు రాకుండా ఉండటానికి జాగ్రత్తలు అవసరమని అంటున్నారు నిపుణులు. 35ఏళ్లు పైబడిన వాళ్లు అధిక రక్తపోటు ఉన్నా, షుగర్ ఉన్నా, ఊబకాయం, ధూమపానం ఉన్నా కొత్త వ్యాయామాలు పాటించే ముందు డాక్టర్ల సలహాను తీసుకోవడం తప్పనిసరి. డాక్టర్ల సూచన మేరకు ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ECG), కరోనరీ కాల్షియం స్కాన్ చేయించుకోవాలి.
వ్యాయామం చేస్తున్నప్పుడు అసాధారణంగా మరియు అస్థిరంగా ఉంటూ శ్వాస ఆడకపోవడం, గుండె దడ, తల తిరగడం లాంటివి కలిగితే వ్యాయామాన్ని ఆపేసి డాక్టర్ కు చూయించుకోవాలి.

 

ముఖ్యంగా గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే వ్యాయామం తో పాటు ఆహారాన్ని కూడా ఫ్యాట్ లేకుండా తాజా కాయకూరలతో కూడిన వాటిని తినాలి.

 

గమనిక.. పైన తెలిపిన విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పాటించే ముందు డాక్టర్ల సలహా తప్పనిసరి. కచ్చితత్వానికి చానల్ బాధ్యత వహించదు.

 

ఇవి కూడా చదవండి: