Motorola Edge 50 Ultra 5G: రూ.41 వేల డిస్కౌంట్.. స్మార్ట్‌ఫోన్ ధర భారీగా తగ్గింది.. ఆఫర్ల జాతరే!

Rs 41,000 Discount on Motorola Edge 50 Ultra 5G: మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ధర భారీగా తగ్గింది. మోటరోలా ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ గత సంవత్సరం లాంచ్ అయింది. మోటరోలా ఎడ్జ్ 60 సిరీస్ లాంచ్ తర్వాత, కంపెనీ గత సంవత్సరం లాంచ్ చేసిన మోడల్ ధరను తగ్గించాలని నిర్ణయించింది. ఈ అల్ట్రా స్మార్ట్‌ఫోన్ దాని లాంచ్ ధర కంటే రూ.15,000 తక్కువ ధరకు లభిస్తుంది. ఇందులో 12GB RAM+ 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.
ఈ ఫోన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.49,999 ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.64,999 ధరకు లాంచ్ చేశారు. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనుగోలుపై ధర తగ్గింపుతో పాటు, రూ. 4,000 ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తున్నారు. అదనంగా, నో-కాస్ట్ EMI , ఇతర బ్యాంక్ ఆఫర్లు కూడా అందిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.41,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
Motorola Edge 50 Ultra 5G Specifications
ఈ మోటరోలా ఫోన్ నార్డిక్ వుడ్, పీచ్ ఫజ్ వీగన్ లెదర్ ఫినిషింగ్ తో వస్తుంది. ఈ ఫోన్‌లో 6.7-అంగుళాల సూపర్ HD డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్‌లో pOLED డిస్‌ప్లే ప్యానెల్ ఉంది. దీని డిజైన్ కర్వ్‌గా ఉంటుంది . ఫోన్ డిస్‌ప్లే HDR10+, 144Hz రిఫ్రెష్ రేట్, 2800 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ ఫీచర్‌లకు సపోర్ట్ ఇస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కమ్ 8s జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనిలో 12GB RAM+ 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. దీనిలో శక్తివంతమైన 4,500mAh బ్యాటరీ ఉంది, దీనితో 125W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేస్తుంది.
మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. దీనికి 50MP మెయిన్, 50MP అల్ట్రా వైడ్, 64MP మూడవ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్‌లో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 50MP కెమెరా ఉంది. కనెక్టివిటీ కోసం డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, డ్యూయల్ 5G సిమ్ కార్డ్ ఉన్నాయి.