Surrogacy: నయనతారకు తమిళ ప్రభుత్వం షాక్..!
లేడీ సూపర్‌స్టార్ నయనతారకు తమిళనాడు ప్రభుత్వం షాకిచ్చింది. తన సరోగసీ వివాదంపై విచారణ కమిటీ వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల పెళ్లి పీటలు ఎక్కిన నయనతార-విఘ్నేశ్ శివన్‌లు 5 నెలలు తిరక్కుండానే కవలకు తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే.
Surrogacy: లేడీ సూపర్‌స్టార్ నయనతారకు తమిళనాడు ప్రభుత్వం షాకిచ్చింది. తన సరోగసీ వివాదంపై విచారణ కమిటీ వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల పెళ్లి పీటలు ఎక్కిన నయనతార-విఘ్నేశ్ శివన్‌లు 5 నెలలు తిరక్కుండానే కవలకు తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. ఈతరుణంలోనే సరోగసీ(అద్దె గర్భం) ద్వారానే వారు తల్లిదండ్రులు అయ్యారనే వాదనలు వెల్లువెత్తాయి. ఇక దీనిపై తమిళనాడు ప్రభుత్వం స్పందించింది.
ప్రస్తుతం ఎక్కడ చూసినా నయన్ సరోగసీ అంశంపై తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తమిళనాడు ప్రభుత్వం నయన్ దంపతులకు షాకిచ్చింది.
నయన్ విఘ్నేశ్ దంపతుల సరోగసి అంశంపై విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
నయన్ సరోగసీపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక అందించాలని ఈ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. తల్లిదండ్రులు కావడంపై ప్రభుత్వానికి నయస్ దంపతులు వివరణ ఇవ్వాల్సి ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణ్యన్ పేర్కొన్నారు. అయినా కానీ దీనిపై ఇప్పటి వరకు వారు స్పందించలేదు.
ఇదీ చదవండి: విడాకులు తీసుకుంటున్న మరో స్టార్ హీరో..!