Dasara Movie : దసరా సినిమాలో కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ అదిరిందిగా !
తాజాగా ఈ సినిమా మేకర్స్ కీర్తి సురేష్ సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేశారు. ‘బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన’..అనే క్యాప్షన్‌తో ఒక వీడియోను ట్వీట్ చేసింది.పక్కా పల్లెటూరి అమ్మాయి పాత్రలో కీర్తి నటించినట్లు గ్లింప్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది.బ్యాగ్రౌండ్ స్కోరును ఫోక్ సింగర్ కనకవ్వ అలపించినట్లు తెలుస్తుంది.

Dasara Movie: నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సినిమా ‘దసరా’.ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో నాని తెలంగాణ యువకుడి పాత్రలో కనిపించబోతున్నాడు.సింగరేణి నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పక్కా మాస్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి నాని ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. తాజాగా ఈ సినిమా మేకర్స్ కీర్తి సురేష్ సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేశారు. ‘బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన’..అనే క్యాప్షన్‌తో ఒక వీడియోను ట్వీట్ చేసింది.పక్కా పల్లెటూరి అమ్మాయి పాత్రలో కీర్తి నటించినట్లు గ్లింప్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది.బ్యాగ్రౌండ్ స్కోరును ఫోక్ సింగర్ కనకవ్వ అలపించినట్లు తెలుస్తుంది.
కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ ను నిన్న విడుదల చేశారు. ‘నేను లోకల్’ సినిమా తర్వాత నాని, కీర్తి కలిసి నటిస్తున్న సినిమా ఇదే . ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకం పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. తమిళ మ్యూజిక్ డైరెక్ట్ సంతోష్ నారాయణ్ ఈ సినిమాకు స్వరాలను అందిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలిసిన సమాచరం. ఈ సినిమాను 2023 మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది.దీనిని తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో సాయికుమార్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Bangaari bomma dorikenammo.. ee vaadalonaa
The first look of @KeerthyOfficial from #Dasara to be unveiled tomorrow at 11:11am
Natural Star @NameisNani @odela_srikanth @Music_Santhosh @saregamasouth pic.twitter.com/Lop8AXol5O
— SLV Cinemas (@SLVCinemasOffl) October 16, 2022