8 Vasanthalu Trailer: ఆడదాని ప్రేమకు సాక్ష్యాలు ఏమున్నాయి.. హత్తుకునేలా ‘8 వసంతాలు’ ట్రైలర్, చూశారా?
8 Vasanthalu Official Trailer Out Now: మ్యాడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులు దగ్గరైంది మలయాళ బ్యూటీ అనంతిక సానిల్ కుమార్. ఈ చిత్రంలోనే ఆమె హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఇక ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘8 వసంతాలు’. ఉమెన్ సెంట్రిక్‌గా వస్తున్న ఈ సినిమాకు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
విడుదల కొన్ని రోజులే ఉండం మూవీ టీం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. ఆడవాళ్ల జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు, ఒడిదుడుకులు, ప్రేమ, కుటుంబ సమస్యలు వంటి ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమైపోతుంది. ‘చూడమ్మా.. ఆడవాళ్లు నిప్పు పట్టకూడదు.. అంత్యక్రియలు, కర్మకాండలకు వాళ్లు పనికిరారు’ అంటూ ఓ పూజారి హీరోయిన్‌తో చెబుతున్న సన్నివేశంతో ట్రైలర్ మొదలైంది.
ఆ తర్వాత హీరోయిన్ మార్షల్ ఆర్ట్స్‌లో ఎలాంటి ప్రావీణ్యం ఉంది, వాటిలో శిక్షణ తీసుకుంటున్న సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఇందులో తల్లిదండ్రుల ఆశయం కోసం పరిగెత్తే అమ్మాయి జీవితంలో ఎదురైన ప్రేమ.. ఆమె జీవితంలోకి వచ్చిన ఇద్దరు అబ్బాయిలు.. ఆ తర్వాత ఏం జరిగిందనే ఈ సినిమా కథ అని తెలుస్తోంది. ఇక చివరిలో హీరోయిన్.. “మగాడి ప్రేమకు సాక్ష్యాలుగా పాలరాతి సౌధాలు.. భాగ్యనగరాలు ఉన్నాయి.. ఆడదాని ప్రేమకు ఏమున్నాయి.. మనసులోనే సమాధి చేసుకున్న జ్ఞాపకాలు తప్పా..” అనే డైలాగ్ మనసుని హత్తుకునేలా ఉంది.
8 వసంతాలు టీజర్ ఆద్యాంత ఆకట్టుకుంటుంది. ఎమోషనల్ సాగిన ఈ ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచేస్తోంది. ఆనంతిక నటన, ఆమె పండిన ఎమోషన్స్ హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి. మొత్తానికి ప్రేమ, ఎమోషన్స్‌తో ‘8 వసంతాలు’ ట్రైలర్ ఆద్యాంత ఆసక్తిగా సాగింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ మూవీపై అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. రవితేజ దుగ్గిరాల, హనురెడ్డి, కన్న పసునూరి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో నవీన్ యర్నేనీ, వై రవిశంకర్‌లు నిర్మిస్తున్నారు. జూన్ 20న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.