Published On:

PuriSethupathi: స్టార్స్ ను దింపుతున్నావ్.. హిట్ కొట్టాలి పూరి.. ?

PuriSethupathi: స్టార్స్ ను దింపుతున్నావ్.. హిట్ కొట్టాలి పూరి.. ?

PuriSethupathi: డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒక మంచి హిట్ ఇండస్ట్రీకి ఇచ్చి మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని ట్రై చేస్తున్నాడు. వరుస ప్లాప్స్ మధ్య ఉన్న పూరి.. ఇస్మార్ట్ శంకర్ తో తానేంటో నిరూపించుకున్నాడు. రామ్ పోతినేని లాంటి లవర్ బాయ్ ను ఉస్తాద్ ను చేశాడు. ఇక ఈ సినిమా తరువాత పూరికి తిరుగేలేదు అనుకున్నారు. ఆ సమయంలోనే లైగర్ అంటూ విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా సినిమా తెరకెక్కించి బొక్క బోర్లా పడ్డాడు. అసలు ఆ సినిమా ఏంటో.. ? ఆ కథ ఏంటో.. ? తెలియక చాలామంది ఫ్యాన్స్  తలలు కొట్టుకున్నారు.

 

పోనీ సినిమా డిజాస్టర్ టాక్ వచ్చింది వదిలేద్దాం అనుకోలోపు వివాదంలో ఇరుక్కుంది. లైగర్ కోసం పెట్టిన పెట్టుబడులు ఎక్కడనుంచి వచ్చాయని ఈడీ విచారణకు పిలిచింది. అలా ఆ వివాదం నుంచి బయటపడ్డాకా.. పూరి గట్టిగా అలోచించి హిట్ సినిమా అయినా ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ ప్రకటించి డబుల్ ఇస్మార్ట్ అని టైల్ పెట్టి అందులోకి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను దింపాడు. ఇదైనా వర్క్ అవుట్ అవుతుందా అనుకుంటే.. లైగర్ కన్నా డిజాస్టర్ టాక్ ను తెచ్చుకుంది.

 

ఇక దీంతో పూరిని సినిమాలకు పనికిరాడని, అతనిలో ఉన్న క్రియేటివిటీ పోయిందని కొందరు కామెంట్స్ చేశారు. కానీ, పడిపోయిన ప్రతిసారి లేవడం నేర్చుకున్న పూరి.. కోలీవుడ్  స్టార్ హీరో విజయ్ సేతుపతికి కథ చెప్పి.. అతని ఒప్పించి కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మధ్యనే పూరి సేతుపతి సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను పూరి – ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 

ఇక గత కొన్నిరోజుల నుంచి ఈ సినిమాలో సీనియర్ బ్యూటీ టబు  కీలక పాత్రలో నటిస్తుందని వార్తలు వినిపించాయి. తాజాగా  ఆ వార్తలను నిజం చేస్తూ పూరిసేతుపతి సినిమాలోకి టబును అధికారికంగా ఆహ్వానిస్తూ పోస్ట్ పెట్టారు. “ఆమె ఒక పవర్, ఆమె ఒక విస్ఫోటనం.. ఆమెనే టబు. పూరిసేతుపతి సినిమాలో ఒక డైనమిక్ క్యారెక్టర్ చేస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు.  ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

 

ఇక ఈ పోస్ట్ చూసిన పూరి అభిమానులు.. స్టార్స్ ను దింపుతున్నావ్.. హిట్ కొట్టాలి పూరి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. కథలో దమ్ము లేకపోతే విజయ్, టబు లాంటివారు ఈ సినిమాను ఒప్పుకొనేవారే కాదు. అందుకే ఈ సినిమాపై అభిమానులు కూడా అంచనాలను పెట్టుకున్నారు. మరి ఈ సినిమాతో పూరి బౌన్స్ బ్యాక్ అవుతాడో లేదో చూడాలి.