Sree Vishnu: మూడు సినిమాలు లైన్లో పెట్టిన సింగిల్..

Sree Vishnu: టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా మారాడు. చిన్న చిన్ పాత్రలు చేస్తూ హీరోగా మారి.. డిఫరెంట్ కథలను ఎంచుకొని ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ముఖ్యంగా కామెడీ టైమింగ్ తో అభిమానుల్లో సపరేట్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు.
గతేడాది ఓం భీమ్ బుష్, స్వాగ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కుర్ర హీరో.. ఈసారి సింగిల్ అంటూ రాబోతున్నాడు. శ్రీ విష్ణు హీరోగా నటించిన సింగిల్ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన కేతిక శర్మ, ఇవానా నటిస్తున్నారు. మే 30 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ టీజర్ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో శ్రీ విష్ణు తన తదుపరి సినిమాల గురించి చెప్పుకొచ్చాడు. సింగిల్ తరువాత మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి చెప్పుకొచ్చాడు.
ఇప్పటికే అమృతం సీరియల్ తో పేరు తెచ్చుకున్న డైరెక్టర్ గుణ్ణం గంగరాజు దర్శకత్వంలో మృత్యుంజయ సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాను ఎప్పుడో ప్రకటించారు. ఇక ఇది కాకుండా మరో రెండు కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట విష్ణు. అందులో ఒకటి ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందని తెలిపారు. ఇంకొకటి స్క్రిప్ట్ సెలెక్షన్ లో ఉందని చెప్పుకొచ్చాడు. సింగిల్ కనుక హిట్ పడితే.. శ్రీ విష్ణు కు ఛాన్స్ లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మరి సింగిల్ తో శ్రీ విష్ణు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
ఇవి కూడా చదవండి:
- Allu Arjun: ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు మిస్టర్ పర్ఫెక్ట్స్ .. అదే సినిమాలో కూడా కనిపిస్తే.. షేక్ అవ్వాల్సిందే