Single Trailer: ఇక మా సింగిల్స్ లైఫ్‌లోకి అమ్మాయిలే రారు.. నవ్వించేలా శ్రీవిష్ణు ‘సింగిల్’ ట్రైలర్

Sree Vishnu Single Official Trailer: హీరో శ్రీవిష్ణు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సహానటుడిగా కెరీర్ ప్రారంభించి హీరోగా మారాడు. వైవిధ్యమైన కథలు, కామెడీ జానర్లతో ఆడియన్స్‌ని మంచి వినోదం పంచుతాడు. శ్రీవిష్ణు సినిమాలంటే ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా ఉంటుందనడంలో సందేహం లేదు. గతేడాది స్వాగ్ అనే ప్రయోగాత్మక చిత్రంతో వచ్చిన శ్రీవిష్ణు ఈసారి సింగిల్ అంటూ మరింత ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అయ్యాడు. మే 9న ఈ చిత్రం విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 28) ట్రైలర్ రిలీజ్ చేసింది. కాగా శ్రీవిష్ణు హీరో, కేతిక శర్మ, లవ్‌టుడే ఫేం ఇవానా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు కార్తీక్ రాజ్ దర్శకత్వం వహించాడు. లవ్,రొమాంటిక్‌గా తెరకెక్కినట్టు ఈ సినిమా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అమ్మాయిలను ఎలా పడేయాలంటే మూడు దారులు అంటూ తన స్నేహితుడు (వెన్నెల కిషోర్)కు వివరిస్తూ కనిపించాడు శ్రీవిష్ణు. ఆ తర్వాత హీరోయిన్లు కేతిక శర్మ, ఇవానాలతో లవ్ ట్రాక్‌ను చాలా ఫన్నీగా చూపించారు. కామెడీ బాగా పండింది. శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్‌లో మధ్య పంచ్ డైలాగ్స్, కామెడీ ఆద్యాంతం ఆకట్టుకుంటుంది.
మా సింగిల్స్ లైఫ్‌లోకి ఇంకేప్పుడు అమ్మాయిలు రారు అనుకున్న తరుణంలో అనగానే హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. ఈ క్రమంలో వచ్చిన కామెడీ సీన్స్ బాగున్నాయి. ఈసారి కూడా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో శ్రీవిష్ణు మరో భారీ హిట్ కొట్టేలాగే ఉన్నాడు. ఇక చివరిగా బ్రేకప్, ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. చివరిలో సంక్రాంతికి వస్తున్నాం ఫేం, చైల్డ్ ఆర్టిస్టు బుల్లిరాజు ఎంట్రీ ట్రైలర్‌కి హైలైట్ అని చెప్పాలి. ‘ఒక మనిషి ఎంత రిచ్ అయినా.. హాచ్ అనే తుమ్ముతారు’ వెన్నెల కిషోర్ చెప్పే డైలాగ్ ఫన్నీగా అనిపించింది. మొత్తానికి ‘సింగిల్’ ట్రైలర్ మూవీపై మరింత ఆసక్తి పెంచుతోంది.
ఇవి కూడా చదవండి:
- Naga Chaitanya Revange on Samantha: సమంత బర్త్‌డే, మాజీ భర్త నాగ చైతన్య షాకింగ్ పోస్ట్.. సామ్‌పై చై రివెంజ్ ప్లాన్..!