Sree Vishnu: శివయ్యా డైలాగ్.. మంచు విష్ణుకు సారీ చెప్పిన శ్రీవిష్ణు

Sree Vishnu:యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం సింగిల్. కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లు గా నటిస్తున్నారు. మే 9 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. రెండు రోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ మొత్తం కామెడీతో నింపేశారు. తనకు అచ్చొచ్చిన కామెడీనే శ్రీవిష్ణు నమ్ముకున్నాడు.
అయితే ట్రైలర్ లో శ్రీవిష్ణు.. మంచి విష్ణుని ట్రోల్ చేసినట్లు సోషల్ మీడియా కోడై కూసింది. ట్రైలర్ లో కన్నప్పలోని శివయ్యా డైలాగ్.. చివర్లో మంచు కురిసిపోవడం అనే డైలాగ్.. మంచి కుటుంబాన్ని అవమానించడమే అని.. ఇది విష్ణు వరకు వెళ్ళడం.. ఆయన కూడా సీరియస్ అయ్యాడని ఇన్ సైడ్ వర్గాలు మాట్లాడుకున్నాయి. అంతేకాకుండా ఆ డైలాగ్స్ ను డిలీట్ చేయకపోతే.. విష్ణు సీరియస్ యాక్షన్ తీసుకున్నాడని, సింగిల్ టీమ్ మీద ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు కూడా చేయనున్నాడని వార్తలు వచ్చాయి.
ఇప్పటివరకు ఎలాంటి వివాదం లేని శ్రీవిష్ణు.. ఈ సినిమా ద్వారా వివాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా కొందరు చెప్పుకొచ్చారు. అయితే గోటితో పోయేదాన్నీ గొడ్డలి వరకు తెచ్చుకోవడం ఎందుకు అనుకున్నాడో ఏమో శ్రీవిష్ణు.. తాజాగా ఆ డైలాగ్స్ ను డిలీట్ చేయడమే కాకుండా హార్ట్ అయినవారికి సారీ కూడా చెప్పుకొచ్చాడు.
” సింగిల్ ట్రైలర్ ఈ నెల 28 న లాంచ్ చేశాం. మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే విధంగా కన్నప్ప సినిమాలో మేము వాడిన కొన్ని డైలాగ్స్ కు ఆ టీమ్ కొద్దిగా హార్ట్ అయ్యారని తెలిసింది. తెల్సిన వెంటనే మేము ఈ వీడియో చేస్తున్నాం. అది కావాలని చేసింది కాదు. కానీ, అది తప్పుగా కన్వే అయ్యింది. అందుకే వెంటనే డిలీట్ చేశాం. అవి సినిమాలో కూడా ఉండవు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫాలో అయ్యే మీమ్స్ కానీ, బయట జరిగిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఎక్కువ జరుగుతున్నాయో అలాంటివి ఎక్కువ వాడాము. ఆ ప్రాసెస్ లోనే చిరంజీవి, బాలకృష్ణ డైలాగ్స్ వాడాము. అవి తప్పుగా అర్ధం అయితే క్షమించండి. అలాంటివి ఇక నుంచి రాకుండా చూసుకుంటాం. ఇక ఎన్ని అనుకున్నా.. మేమంతా ఒక ఇండస్ట్రీ. ఒక ఫ్యామిలీ కిందనే ఉంటాం కాబట్టి పొరపాటున ఏదైనా తప్పుగా అర్ధం అయినా కూడా వెరీ సారీ. మేమంతా ఒకటే” అంటూ శ్రీవిష్ణు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
#single sorry pic.twitter.com/0qid5xWcWQ
— devipriya (@sairaaj44) April 30, 2025