Actor Prakash Raj: సినీ నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు.. ప్రశ్నించే గొంతులను పాలకులు అణిచేవేస్తారు!
Actor Prakash Raj Sensational Comments On Politicians: రాజకీయ ఖైదీలు ఏదో చేశారని జైళ్లల్లో పెట్టలేదని, ఏదైనా చేస్తారేమోనన్న భయంలో బందీంచారని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ‘చందమామను ఎంతకాలం బందీ చెయ్యగలరు’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశ్నించే గొంతులను పాలకులు అణిచేవేయాలని చూస్తారని, కానీ ఆ ప్రయత్నంలో గెలిచినట్లు చరిత్రలో లేరని ప్రకాశ్ రాజ్ అన్నారు.
అణచివేతలపై మౌనం వాటిని సమర్థించడమేనన్నారు. ప్రతీ ఒక్కరూ పౌర హక్కుల కోసం గొంతెత్తాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన జేఎన్‌యూ విద్యార్థి ఉద్యమస్ఫూర్తిని ప్రస్తావించారు. ఇలాంటి పుస్తకాలు, సమావేశాలు, మాటలు నమ్మకాన్ని ఇస్తాయన్నారు.