Published On:

Sharwa38 Movie Title: పండగ పేరుతో శర్వానంద్‌ కొత్త సినిమా టైటిల్‌ – 1960 బ్యాక్‌డ్రాప్‌లో పవర్ఫుల్‌ స్టోరీతో వస్తున్న ఛార్మింగ్‌స్టార్‌

Sharwa38 Movie Title: పండగ పేరుతో శర్వానంద్‌ కొత్త సినిమా టైటిల్‌ – 1960 బ్యాక్‌డ్రాప్‌లో పవర్ఫుల్‌ స్టోరీతో వస్తున్న ఛార్మింగ్‌స్టార్‌

Sharwanand and Sampath Nandi Movie Titled Bhogi: ఛార్మింగ్‌స్టార్‌ శర్వానంద్‌ బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో దూసుకుపోతున్నాడు. చివరిగా మనమేతో పలకిరించిన శర్వా.. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌ని లైన్‌లో పెట్టాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలకు కమిట్‌ అయ్యాడు. అందులో డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో ఓ సినిమాకు సంతకం చేశాడు. వీరిద్దరి కాంబో ఓ సిసినిమా వస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. ఇటీవల ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌, స్క్రిప్ట్‌ వర్క్‌ని పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా సెట్స్‌పైకి వచ్చింది.

 

ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ గ్లింప్స్‌ రిలీజ్ చేశారు. రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలైన రోజే మూవీ టైటిల్‌ ప్రకటించి క్యూరియాసిటి పెంచింది టీం. తాజాగా విడుదలైన ఈ గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ఈ సినిమాకు ‘భోగి’ అనే టైటిల్‌ ఖరారు చేసినట్టు ఈసందర్భంగా వెల్లడించారు. ఈమేరకు రిలీజ్‌ చేసిన గ్లింప్స్‌ ఆకట్టుకుంటోంది. కత్తిపై మంటలలో భోగి అనే టైటిల్స్‌ చూపిస్తూ సాగింది. ఈ సందర్భంగా మూవీ కథ, కథనం ఎలా ఉండబోతుందో కూడా హింట్‌ ఇచ్చేశారు.

 

ఈసారి శర్వా పాన్‌ ఇండియాగా రాబోతున్నాడు. శర్వానంద్‌ 38వ సినిమా ఇది. ఈ మూవీ కథ 1960 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనుందని ఇప్పటికే దర్శక-నిర్మాతలు స్పష్టం చేశారు. ఇక తాజాగా రిలీజ్‌ చేసిన గ్లింప్స్‌లో గ్రామీణ నేపథ్యంలో సాగనుందని చెప్పేశారు. ఉత్తర తెలంగాణతో పాటు మహారాష్ట్ర ప్రాంతంలోని జరిగే కథతో యాక్షన్‌ థ్రిల్లర్‌ తెరకెక్కనుంది. ఇందులో వయోలెన్స్‌ మామూలుగా ఉండదని గ్లింప్స్‌తో హింట్‌ ఇచ్చేసారు. చివరిలో మేకపోతు, కత్తి, వయోలెన్స్‌, కాళ్లకు గజ్జలు, గ్రామానికి సంబంధించిన విజువల్స్‌ చూపించారు.

 

చూస్తుంటే ఈసారి శర్వా పవర్ఫుల్‌ కథతో ఊరమాస్‌ అవతార్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేలా కనిపిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా భాషల్లో తెరకెక్కిస్తున్నారు చివరిలో చూపించి మరింత ఆసక్తిని పెంచారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్‌ పతాకంపై కేకే రాధా మోహన్‌ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘భోగి’ సినిమా చిత్రీకరణ కోసం హైదరాబాద్‌ శివారులోని ఇరవై ఎకరాల్లో మూవీ కోసం ప్రత్యేకంగా భారీ సెట్‌ వేసి, అందులో చిత్రీకరణ ప్రారంభించబోతున్నారు.