shaakuntalam jewellery: శాకుంతలం కోసం 14 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు
Shaakuntalam Jewellery: నటి సమంత నటించిన తాజా చిత్రం ‘శాకుంతలం’. పాన్ ఇండియా లెవల్ లో తెరకిక్కిన ఈ మైథాలాజికల్ ఫిల్మ్ ప్రపంచ వ్యాప్తంగా వేసవి కానుకగా ఏప్రిల్ 14 న శాకంతలం విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ భారీగా ప్రమోషన్స్ చేస్తోంది. తాజాగా శాకుంతలం మేకర్స్ సినిమాకు సంబంధించిన పలు ఆస్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. శాకుంతలంలో సమంత పాత్ర కోసం సుమారు రూ. 14 కోట్ల రూపాయల విలువైన నిజమైన బంగారం, డైమండ్స్ వినియోగించినట్టు డైరెక్టర్ గుణశేఖర్ తెలిపారు.
6 నుంచి 7 నెలలు శ్రమించి(shaakuntalam jewellery)
దాన వీర శూర కర్ణలో ఎన్టీఆర్ వాడిన బంగారు కిరీటం స్ఫూర్తితో.. తన సినిమాల్లో హీరో, హీరోయిన్లకు నిజమైన బంగారం, వజ్రాలను పొదిగిన ఆభరణాలనే వినియోగించినట్టు గుణశేఖర్ వెల్లడించారు. శాకుంతలం ఏప్రిల్ 14 న విడుదలవుతున్న సందర్భంగా ఆ చిత్రంలో శకుంతల, దుష్యుంతుడు ధరించిన బంగారు, వజ్రాభరణాల ఫొటోలను హైదరాబాద్ లోఆవిష్కరించారు.
శాకుంతలం కోసం ప్రముఖ డిజైనర్ నీతూ లుల్లా డిజైన్ చేసిన ఈ ఆభరణాలను ప్రముఖ జ్యువెలరీ సంస్థ సుమారు 6 నుంచి 7 నెలలు శ్రమించి తయారుచేసింది. పూర్తిగా చేతితో తయారు చేసిన ఆభరణాలు.. తన పాత్రలకు మరింత అందాన్ని, రాజసాన్ని తీసుకొచ్చాయని గుణశేఖర్ ఆనందం వ్యక్తం చేశారు.
15 కిలోల బంగారంతో
శకుంతల పాత్ర కోసం 15 కిలోల బంగారంతో సుమారు 14 రకాల ఆభరణాలను తయారు చేసినట్లు తెలిపారు. దుష్యంత మహారాజు పాత్ర కోసం 8 నుంచి 10 కిలోల బంగారంతో ఆభరణాలు తయారు చేశామని, మేనక పాత్రధారి మధుబాల కోసం 6 కోట్లతో వజ్రాలు పొదిగిన దుస్తులను రూపొందించినట్లు గుణశేఖర్ పేర్కొన్నారు.
శాకుంతలంపై భారీ అంచనాలు
మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించింది. దిల్‌రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. మలయాళ నటుడు దేవ్ మోహన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. రుద్రమదేవి తర్వాత గుణశేఖర్ ఈ సినిమా కోసం దాదాపు ఏడేళ్ళ సమయం తీసుకున్నాడు. ఇక ఈ సినిమాను ప్రముఖ కవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా చేసుకుని.. గుణ శేఖర్ ఈ సినిమాని తీస్తున్నారు.