New Covid 19 Symptoms: కరోనా కొత్త వేరియంట్, గొంతులో బ్లేడ్లతో కోసుకుపోయే బాధ.. నివారణా మార్గాలు ఇవే!
New Covid 19 Symptoms and Preventions: కరోనా పేరు చెబితేనే ప్రపంచం ఉలిక్కి పడుతుంది. అందుకు కారణాలు అనేకం. చాలా మంది తమ ఆప్తులను కోల్పోయిన కాలం అది. అంతిమసంస్కారాలు కూడా గౌరవంగా చేయని కాలం అది. అందుకే కరోనా పేరు చెబితేనే ప్రజలు వనికిపోతారు. కేవలం ప్రాణాలు కోల్పోవడమే కాదు, ఆర్థికంగా చాలా క్రుంగి పోయారు చాలా మంది. ఇప్పటికి కొందరు కోలుకోలేకపోతున్నారు అంటే అతిశయోక్తి కాదేమో. కరోనా మరోసారి తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే భారత్ లో కూడా ఇప్పటికే 6వేల కంటే ఎక్కువగా కేసులు పెరిగాయి. అయితే కరోనా నుంచి ఇఫ్పుడు కొంత వేరియంట్ వచ్చింది. అదే NB. 1.8.1.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) NB.1.8.1 వేయింట్ ను నింబస్ అని కూడా పిలుస్తున్నారు. ఈ వేరియంట్ ను మానిటరింగ్ లో ఉంచారు. ఇది ఓమిక్రాన్ కుటుంబానికి చెందినది. దీని వలన గొంతులో తీవ్రమైన మంట వస్తుంది. ఒక రకంగా గొంతు బ్లేడ్ లతో కోసుకుపోతున్న బాధకలుగుతుందని నిపుణులు అంటున్నారు. సలోన్ అనే సంస్థ జూన్ 11న ఒక రిపోర్ట్ ను తయారు చేసింది. దాని ప్రకారం WHO కరోనా కొత్త వేరియంట్ పై శ్రధ్ద వహించింది. NB.1.8.1 అనే కొత్త వేరియంట్ ఇప్పుడు చాలా దేశాలలో వ్యాపించింది. అమెరికా, కెనడా లాంటి దేశాలు దీని భారిన పడ్డాయి.
సలోన్ ప్రకారం .. కరోనా కొత్త వేరియంట్ సోకిన వారికి అలసట, స్వల్ప దగ్గు, జ్వరం, కండరాల నొప్పులు, వికారం, విరేచనాలు వంటి ఫ్లూ లక్షణాలు ఉంటున్నాయి. అయితే ఇప్పటికైతే ప్రమాదం మితిమీరలేదని హద్దుల్లోనే ఉందని తెలుస్తోంది.
సలోన్ ప్రకారం, నింబస్ ఇతర జాతుల నుండి జన్యు పదార్థాన్ని మూడుసార్లు తిరిగి కలిసింది – పునఃసంయోగ ప్రక్రియ అనేది వైరస్ల డెవలప్ కావడానికి ఉపయోగపడుతుంది. ప్రతిసారీ వైరస్ అలా పునఃసంయోగ ప్రక్రియ జరిపినప్పుడు, అది మరింత అంటువ్యాధిగా లేదా తీవ్రమైన వ్యాధికి పరిణామం చెందే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
కరోనా సోకకుండా ఉండాలంటే..
కరోనా సోకకుండా ఉండాలంటే జాగ్రత్తలు తప్పనిసరని అంటున్నారు డాక్టర్లు. ముక్కుకు మాస్క్ ధరించడం. జలుబు, రొంప ఉన్నవారికి దూరంగా ఉండటం చేయాలి. ఆపై సానిటైజర్ వాడాలి. నోటికి రుచి లేకపోయినా, ముక్కుకు వాసన రాకున్నా తక్షణమే డాక్టర్ ను సంప్రదించాలి.