Sankranthiki Vasthunam: ఓటీటీకి ముందే టీవీలో – ‘సంక్రాంతికి వస్తున్నాం’ టెలికాస్ట్ ఎప్పుడంటే!

Sankranthiki Vasthunam TV Premiere: ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ పండుగకి మూడు సినిమాలు రిలీజ్ అవ్వగా.. అందులో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించారు. బాక్సాఫీసు రికార్డు కలెక్షన్స్ చేస్తూ వరల్డ్ వైడ్‌గా రూ. 300 పైగా కోట్లు గ్రాస్ చేసంది.
అలాగే రూ. 150పైగా నెట్ సాధించిన రాబట్టి నిర్మాతలను లాభాల్లో పడేసింది. థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కంటే ఈ చిత్రం టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధం అయ్యింది. ఎలాంటి పెద్ద సినిమా అయినా థియేట్రికల్ రన్ తర్వాత డిజిటల్ ప్రీమియర్‌కు వస్తుంది ఆ తర్వాతే టీవీలో ప్రసారం అవుతుంది. కానీ సంక్రాంతికి వస్తున్నాం మాత్రం మొదట టీవీలో ప్రసారం కానుంది. ఈ మూవీ డిజిటల్‌తో పాటు శాటిలైట్ రైట్స్‌ని జీ సంస్థ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మూవీను మొదటి జీ తెలుగు ఛానల్లో ప్రసారం చేయనున్నట్టు ఇప్పటికే ఈ విషయాన్ని సదరు సంస్థ వెల్లడించింది.
తాజాగా సంక్రాంతికి వస్తున్నాం టెలివిజన్ ప్రీమియర్ ఎప్పుడో తెలిపింది. మార్చి 1వ తేదీన సాయంత్రం 6 గంటలకు సంక్రాంతికి వస్తున్నాం సినిమాను టెలికాస్ట్ చేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో జీ సంస్థ అధికారిక ప్రకటన ఇచ్చింది. అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడనేది మాత్రం ఇంకా స్పష్టం చేయలేదు. ఓటీటీలు వచ్చాక టీవీ రేటింగ్స్ దారుణంగా పడిపోతున్నాయి. దీంతో టీవీ రేటింగ్స్ పెంచుకునేందుకు జీ తెలుగు ఇలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్‌తో దుమ్మురేపిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ టీవీల్లో ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుందో చూడాలి.