Published On:

Special Trains for Rishikesh To Yasvantapur: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిషికేష్- యశ్వంతపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు

Special Trains for Rishikesh To Yasvantapur: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిషికేష్- యశ్వంతపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు

South Central Railway announced Special Train Between Rishikesh To Yasvantapur : ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రిషికేష్- యశ్వంతపూర్ మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ రైలు ఏపీ, తెలంగాణలో పలు స్టేషన్ల గుండా వెళ్తుందని తెలిపారు. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రయాణ సౌకర్యం కలగనుంది. రైలు నెం. 06597 యశ్వంతపూర్- రిషికేశ్ మధ్య నేటి నుంచి ప్రతి గురువారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. యశ్వంతపూర్ నుంచి ఉదయం 7 గంటలకు రిషికేశ్ కు బయల్దేరుతుంది. ఆదివారం ఉదయం ఉదయం 10.20 గంటలకు రిషికేష్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నెం. 06598 రిషికేశ్- యశ్వంతపూర్ మధ్య ప్రతి ఆదివారం రైలు అందుబాటులో ఉండనుంది. రిషికేశ్ నుంచి సాయంత్రం 5.55 గంటలకు యశ్వంతపూర్ బయల్దేరుతుంది. మంగళవారం రాత్రి 7.45 గంటలకు యశ్వంతపూర్ చేరుకుంటుంది.

 

కాగా ఈ ప్రత్యేక రైలుకు యలహంక, హిందూపూర్, ధర్మవరం జంక్షన్, అనంతపూర్, డోన్ జంక్షన్, కర్నూలు, కాచిగూడ, కాజీపేట, బాల్హర్షా, నాగపూర్, భోపాల్, బినా, విరాంగణ లక్ష్మీభాయ్ ఝాన్సీ జంక్షన్, గ్వాలీయర్, ఆగ్రా కంటోన్మెంట్, మథుర జంక్షన్, హజ్రత్ నిజాముద్దీన్, ఘజియాబాద్, మీరట్, ముజఫర్ నగర్, తప్రి జంక్షన్, రూర్కే, హరిద్వార్ స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు. ఈరైలు మొత్తం 2549 కి.మీ. ప్రయాణించనుంది. ఈరైలుకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్ క్లాసులు, జనరల్ కోచ్ లు ఉన్నాయి.