Risks of High Protein Food: అధిక ప్రోటీన్ ను తీసుకుంటే ఈ సమస్యలు తప్పవు!

Risks of High Protein Food: ప్రోటీన్ తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం. జిమ్ చేసే వారైతే ప్రోటీన్ ను కావలసినంత తీసుకుంటారు. అయితే ఏదైనా అతిగా తీసుకుంటే నష్టపోతాం. అందులో భాగంగానే ప్రోటీన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోటీన్ అనేది ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలకపాత్ర పోషిస్తుంది. తగినంత ప్రోటీన్ తీసుకోవడం వలన కండరాల పెరుగుదల, బరువు పెంచడం, రోగనిరోధకతపై కూడా తగినంత ప్రభావం చూపెడుతుంది. ప్రోటీన్ లోపాన్ని నివారించడానికి, నిపుణులు మాంసం, చేపలు, సముద్ర ఆహారం, గుడ్లు, పాల ఉత్పత్తులు, బీన్స్, చిక్కుళ్ళు, గింజలు, విత్తనాలు మరియు సోయా వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలని సిఫార్సు చేస్తున్నారు.
మరికొంతమందికి మాత్రం.. అధిక ప్రోటీన్ ను తీసకోవడం వలన ఆనారోగ్యం ఏర్పడుతుంది. ప్రోటీన్ ను ఎప్పుడు ఏ విధంగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రోటీన్ ను అధికంగా తీసుకోవడం వలన సమస్యలు వస్తాయి. ఎవరికైతే మూత్రపిండాల వ్యాధి ఉంటుందో వారు ప్రోటీన్ అధికంగా తీసుకోకూడదు. మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు ప్రోటీన్ ను సరిగ్గా ప్రాసెస్ చేయడంలో ఇబ్బంది పడవచ్చు. అధిక ప్రోటీన్ ను తీసుకోవడం వలన మూత్రపిండాలపై అదనపు ఒత్తిడి కలిగిస్తుంది. ఇది పరిస్థితిని మరింత దిగజార్చుతుంది.
యూరిక్ యాసిడ్ స్థాయిలు: అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం, ముఖ్యంగా రెడ్ మీట్ తీసుకోవడం, సీ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వలన శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి అవకాశం ఉంది. యూరిక్ ఆసిడ్ శరీరంలో పెరిగితే మోకాళ్ళ నొప్పులు, అరుగుదల ఏర్పడతాయి. కాబట్టి ప్రోటీన్ ను తీసుకునేముందు డైటీషియన్ ను డాక్టర్ ను సంప్రదించగలరు.
గమనిక.. పైన తెలిపిన విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. మీరు నిర్ణయానికి వచ్చేముందు డాక్టర్ ను తప్పక సంప్రదించగలరు. కచ్చితత్వానికి చానల్ బాధ్యత వహించదు.