Last Updated:

Pushpa 2 The Rule: ఓటీటీలోకి పుష్ప-2 డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Pushpa 2 The Rule: ఓటీటీలోకి పుష్ప-2 డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Pushpa 2 the rule OTT Release Date fix Streaming: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2 ది రూల్’. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా.. ఫహద్ ఫాసిల్, జగదీష్, ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ, రావు రమేశ్ కీలక పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 5వ తేదీన విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటికే రూ.1,850 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూళ్లు చేసింది. తాజాగా, మూవీ మేకర్స్ అప్‌డేట్ ప్రకటించారు.

‘పుష్ప-2 ది రూల్’ సినిమా రికార్డులను షేక్ చేసింది. ఈ మూవీ ఓటీటీలోకి వస్తుంది. ఇందులో భాగంగానే ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌పై సోషల్ మీడియా వేదికగా జోరుగా సాగుతోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జనవరి 30వ తేదీన అన్ని భాషల్లో నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. అయితే ఈ సినిమా ప్రస్తుతం 3 గంటల 40 నిమిషాల నిడివితో ఉండగా.. మళ్లీ రీలోడెడ్ వెర్షన్ థియేటర్లలో ప్రదర్శిస్తుండగా.. ఓటీటీలో కూడా ఇదే వెర్షన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రికార్డ్స్ నమోదు చేస్తుందో చూడాలి మరి.