Published On:

Dil Raju Press Note on Pawan: పవన్ వ్యాఖ్యలపై దిల్ రాజు ప్రెస్ నోట్ విడుదల

Dil Raju Press Note on Pawan: పవన్ వ్యాఖ్యలపై దిల్ రాజు ప్రెస్ నోట్ విడుదల

Dil Raju Press Note on Pawan Kalyan theatre shutdown issue: తెలుగు సినీ పరిశ్రమలో తాజాగా థియేటర్ల బంద్ చిలికి చిలికి గాలివానగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అవగా థియేటర్ల బంద్ రద్దు అయింది. పవన్ నిర్ణయాన్ని అగ్ర నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ స్వాగతించారు. ఇందుకుగాను దిల్ రాజు ప్రెస్ నోట్ ను మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ సూచించినట్లుగానే చిత్ర పరిశ్రమ ముందుకు నడుస్తుందని హామీ ఇచ్చారు.

 

తెలుగు చిత్ర పరిశ్రమను గాడిలో పెట్టాలని పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో సినిమాహాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టి, ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలన్న పవన్‌ కళ్యాణ్‌ సూచనలపై నిర్మాత దిల్‌ రాజు స్పందించారు. సినిమా టికెట్‌ ధరల పెంపు కోసం వ్యక్తిగతంగా కాకుండా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు.

dil raju press note on pawan kalyan

dil raju press note on pawan kalyan

 

సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలను అందరికీ అందుబాటులోకి తేవాలని పవన్‌ కళ్యాణ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. వీటిపై స్పందిస్తూ దిల్‌ రాజు సోషల్‌ మీడియా వేదికగా నోట్‌ విడుదల చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ సూచనలను తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉందని నిర్మాత దిల్‌ రాజు పేర్కొన్నారు. అందుకోసం సినీ ఇండస్ట్రీ నుంచి తన వంతు సహకారం, కృషి చేస్తానని స్పష్టం చేశారు.

 

థియేటర్ల నుంచి ఓటీటీ ఫ్లాట్ ఫాంకు సినిమాలు ఎప్పుడు వెళ్లాలన్న నిర్ణయాన్ని సినిమావాళ్లు కలిసినిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు దిల్ రాజు. ప్రేక్షకుడికి సినిమాను వెండితెరపై చూసే అనుభూతిని కలుగజేయడం అందరి బాధ్యతని నొక్కి వక్కానించారు. ప్రభుత్వాలను వ్యక్తిగతంగా కాకుండా ఫిలిం చాంబర్ ద్వారా కలవడమనేది పరిశ్రమకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు దిల్ రాజు కృతజ్ఞతలు తెలిపారు.

 

పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ కు ముందు కావాలనే కొందరు థియేటర్ల బంద్ కు పిలుపునిచ్చారన్న వార్తలు గుప్పుమన్నాయి. దీంతో పవన్ పూనుకుని చిత్రసీమ ఎదుర్కుంటున్న థియేటర్ల సమస్యను పరిష్కరించారు.

 

ఇవి కూడా చదవండి: