Sonu Sood @Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సోనూ సూద్.. 25 ఏళ్ల తర్వాత..!
Actor Sonu Sood visits Tirumala Sri Venkateswara Swamy Temple: ప్రముఖ యాక్టర్ సోనూ సూద్ తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడిని దర్శించుకున్నాడు. ఇవాళ తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మేరకు వేదపండితులు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో సోనూ సూద్ మాట్లాడారు. తిరుమలకు తొలిసారి 25 ఏళ్ల క్రితం వచ్చానన్నారు. మళ్లీ ఇవాళ నా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నామన్నారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అయితే మా టీం త్వరలో కొత్త ప్రాజెక్టు స్టార్ట్ చేయనున్నామన్నారు. ఈ ప్రాజెక్టుకు ‘నంది’ పేరు ఖరారు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో స్వయంగా నేను యాక్టర్‌గా నటించడంతో పాటు డైరెక్షన్ కూడా చేస్తున్నట్లు చెప్పారు.
#WATCH | Tirupati, Andhra Pradesh | Actor Sonu Sood visits Lord Sri Venkateswara Swamy Temple in Tirumala to offer prayers.
Sonu Sood says, "When I came here for the first time, it was 25 years ago. Today, I come here with my family. I pray for happiness, peace and prosperity… pic.twitter.com/u2YBoZKxaU
— ANI (@ANI) June 2, 2025