Pushpa 2: థియేటర్లో పుష్ప 2 ప్రేక్షకులకు వింత అనుభవం – ఇంటర్వెల్లోనే శుభం కార్డు
Kochi theatre screens Second Half of Pushpa 2: పుష్ప 2 మూవీ చూసేందుకు థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులకు వింత అనుభవం ఎదురైంది. భారీ ధరకు టికెట్స్ కొని థియేటర్‌కు వెళితే ఇంటర్వెల్లోనే సినిమాకు ఎండ్ కార్డ్ పడింది. దీంతో ఆడియన్స్ అంతా కంగుతిన్నారు. మూడు గంటలపైగా ఉన్న సినిమా గంటన్నరలోనే పూర్తయిన ఈ వింత అనుభవం ఆలస్యంగా వెలుగు చూసింది. రెండు రోజుల క్రితం కేరళలోని కొచ్చిన్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది.
కాగా అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ మూవీ ప్రస్తుతం థియేటర్లో దూసుకుపోతుంది. రికార్డు వసూళ్లుతో తెలుగు సినిమా చరిత్రను తిరగరాస్తుంది. ఒక్క తెలుగులోనే కాదు విడుదలైన అన్ని భాషల్లో పుష్ప 2 ప్రభంజనం సృష్టిస్తుంది. ముఖ్యంగా నార్త్ బెల్ట్ ఈ మూవీ క్రేజ్ మామూలుగా లేదు. రోజురోజుకు ఆడియన్స్‌ని కలెక్షన్స్ పెంచుకుంటూ నాలుగు రోజుల్లోనే హిందీ బాక్సాఫీసు వద్ద రూ. 285 కోట్ల గ్రాస్ సాధించిన ఫాస్టెస్ట్ సినిమా ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది. ఇక వరల్డ్ వైడ్‌గా నాలుగు రోజుల్లో రూ. 800పైగా కోట్ల గ్రాస్ చేసింది.
ప్రస్తుతం వరల్డ్ వైడ్‌గా విధ్వంసం రేపుతున్న ఈ సినిమాకు మరో రెండు రోజుల్లో రూ. 1000 క్షబ్‌లో చేరేలా ఉంది. ఇదిలా ఉంటే కొచ్చిన్‌లోని సినీపోలిస్ సెంటర్ స్క్వేర్‌లో ‘పుష్ప 2’ స్క్రినింగ్ వేశారు. ఈ సినిమా చూసేందుకు అత్యుత్సాహంతో ఉన్న ఆడియన్స్ మూవీ స్టార్ట్ అవ్వగానే తెగ ఎంజాయ్ చేశారు. సినిమాలోని అల్లు అర్జున్ ఎలివేషన్స్, ఫైట్ సీన్స్‌కి ఈళలు వేస్తూ పండగా చేసుకున్నారు. ఇలా సినిమా అంతా ఎంజాయ్ చేసిన వారికి ఇంటర్వెల్లోనే శుభం కార్డు పడింది. అదేంటని షాకైన వారు ఆ తర్వాత అసలు విషయాన్ని గుర్తించారు. తామంత ఇప్పటి వరకు చూసింది సెకండాఫ్ అని గుర్తించారు. ఫస్టాఫ్ బదులుగా సెకండాఫ్‌ని ప్రదర్శించినట్టు గురించిన వారు ఈ విషయాన్ని థియేటర్ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయగా కొందరు ఫస్టాఫ్ ప్రదర్శించమని కోరారు.
పది మంది కోసం థియేటర్ యాజమాన్యం ఫస్టాఫ్ వేసింది. ఇక మిగతావారికి డబ్బులు తిరిగి ఇస్తామని హామి ఇచ్చింది. ప్రస్తుతం సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా భారీ అంచనాల మధ్య పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న గ్రాండ్‌గా విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12వేలకు పైగా థియేటర్లో పుష్ప 2 మూవీని రిలీజ్ చేశారు. ఫస్ట్‌డే ఈ సినిమా రూ. 294 కోట్లగ్రాస్తో భారీ ఒపెనింగ్స్ ఇచ్చింది. ఫస్ట్ వీకెండ్ వరకు కలెక్షన్స్‌తో అదే జోరు చూపిస్తూ నాలుగు రోజుల్లో ఏకంగా రూ. 800 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. నేటితో రెండోవారంలోకి అడుగుపెట్టిన ‘పుష్ప 2’ వసూళ్లు ఏ రేంజ్లో ఉంటాయి చూడాలి.