Last Updated:

Sai Kiran: రెండో పెళ్లి చేసుకున్న నటుడు సాయి కిరణ్‌

Sai Kiran: రెండో పెళ్లి చేసుకున్న నటుడు సాయి కిరణ్‌

Sai Kiran and Sravanthi Wedding: నటుడు సాయి కిరణ్‌ ఓ ఇంటివాడు అయ్యాడు. సీరియల్‌ నటి స్రవంతిని తాజాగా పెళ్లి చేసుకున్నాడు. సాయి కిరణ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘నువ్వే కావాలి’, ‘ప్రేమించు’ వంటి సినిమాల్లో నటించి హీరోగా మంచి గుర్తింపు పొందారు. అదే విధంగా పలు చిత్రాల్లో హీరోగా నటించిన ఆయన ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేశారు. ప్రస్తుతం తెలుగు సీరియల్లో నటిస్తూ బుల్లితెరపై సందడి చేస్తున్నారు. కోయిలమ్మ, గుప్పెడంత మనసు వంటి సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి కిరణ్‌ నటుడిగా బుల్లితెరపై ఫుల్ బిజీగా ఉన్నాడు.

ఈ క్రమంలో తన కో-స్టార్‌ స్రవంతిని పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. కాగా ఇదివరకే పెళ్లయిన సాయి కిరణ్‌ భార్యతో విడాకులు అయ్యాయి. ఎంతకాలం నుంచి ఒంటరిగా జీవిస్తున్న సాయి కిరణ్‌ సహా నటి స్రవంతితో పరిచయం ఏర్పడింది. కోయిలమ్మ సీరియల్లో స్రవంతి అతడి వదిన పాత్ర పోషించింది. ఈ క్రమంలో వీరిద్దరి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఏడడుగులు బంధంతో ఒక్కటయ్యారు. గతంలో వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

వీరికి ఓ పాప కూడా ఉంది. అయితే మనస్పర్థలు కారణంగా కొన్నాళ్ల క్రితమే మొదటి భార్య వైష్ణవికి విడాకులు ఇచ్చాడు. కాగా సాయి కిరణ్‌ది సినీ నేపథ్య కుటుంబమే. అతడు దిగ్గజ గాయని పి సుశీలకు మనవడు వరుస అవుతాడు. ఇతడి తండ్రి సింగర్‌. దీంతో ‘నువ్వే కావాలి’ సినిమాతో ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా చేసిన సాయి కిరణ్‌ ఎక్కువ కాలం రాణించలేకపోయాడు. అవకాశాల తగ్గడంతో కాస్తా గ్యాప్‌ తీసుకుని సీరియల్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కొయిలమ్మ సీరియల్‌తో బుల్లితెరపైకి వచ్చాడు. ఇదే క్రమంలో స్రవంతితో పరిచయం, ప్రేమతో వీరిద్దరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.