Bank Janardhan Passed Away: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత!

Kannada Actor Bank Janardhan Passed Away: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, కమెడియన్ బ్యాంక్ జనార్థన్ (75) అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. ఆరోగ్య సమస్యలతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. కన్నడలో పలు సినిమాల్లో నటించిన పలు బుల్లితెర సీరియల్స్‌లోనూ నటించి మంచి గుర్తింపు పొందారు. దీంతో ఆయన మరణంతో కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.
ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం తెలుపుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. 2023లో గుండెపోటుకు గురైన ఆయన చికిత్స అనంతరం కోలుకున్ఆనరు. ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కాసేపటి క్రితం మరణించారు. ఆయన భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం సుల్తాన్‌పాళ్యలోని ఆయన నివాసంలో ఉంచనున్నారు.
కాగా కన్నడ సినీ పరిశ్రమలో పాపా పాండు, మాంగల్య జోకలి, రోబో ఫ్యామిలీ వంటి ప్రముఖ సీరియల్స్ ఆయన నటించి మంచి గుర్తింపు పొందారు. కేఎల్ స్వామి దర్శకత్వంలో 1985లో వచ్చిన పితామహ సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. ఇందులో తన డైలాగ్ డెలివరి, కామెడీ టైమింగ్ కన్నడ ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత ఉపేంద్ర దర్శకత్వం వహించిన ష్, తరే నాన్ మగా, గణేశ్ సుబ్రమన్య వంఇ సినిమాలో నటించారు.
ఇవి కూడా చదవండి:
- Nidhhi Agerwal Counter to Netizens: శ్రీలీలతో పోల్చి సెటైరికల్ కామెంట్స్.. నెటిజన్‌కి నిధి అగర్వాల్ స్ట్రాంగ్ కౌంటర్