Last Updated:

Erracheera: ఎర్రచీర – ది బిగినింగ్.. ఈ నెల 27న రిలీజ్.. రూ.10 వేలు గెలిచే ఛాన్స్..!

Erracheera: ఎర్రచీర – ది బిగినింగ్.. ఈ నెల 27న రిలీజ్.. రూ.10 వేలు గెలిచే ఛాన్స్..!

Erracheera: బేబి డమరి సమర్పణలో పద్మాయల ఎంటర్టైన్మెంట్స్  సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఎర్రచీర – ది బిగినింగ్. ఈ సినిమాలో నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తోంది. ఈ మూవీకి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. శనివారం ఉదయం సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన కార్యక్రమంలో ఘనంగా రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత సి కల్యాణ్ మాట్లాడుతూ సినిమా ట్రైలర్ బాగుంది.  సుమన్ ఈ మూవీని పట్టుదలతో పూర్తి చేసి రిలీజ్ కు తీసుకొస్తున్నాడు. సెంటిమెంట్ ఉన్న హారర్ సినిమాలు తప్పకుండా సక్సెస్ అవుతాయి. అలాంటి మంచి కంటెంట్ ఎర్రచీర సినిమాలో కనిపిస్తోంది.

చిత్ర దర్శక నిర్మాత, నటుడు సుమన్ బాబు మాట్లాడుతూ ఈ మూవీకి మొదటి నుంచి ఎంతోమంది పెద్దలు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ నెల 24న ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నాం. 27న మూవీని రిలీజ్ చేస్తాం. ప్రేక్షకులకు మా మూవీ కోసం ఒక కాంటెస్ట్ పెడుతున్నాం. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ 45 నిమిషాల్లో తిన్న ప్రేక్షకుడికి పది వేల రూపాయలు బహుమతి ఇస్తామని అన్నారు. దాదాపు 300 థియేటర్స్ లో మా సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నాం. మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నాము.

నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా బాగుంది. సుమన్ బాబు ఎంతో పట్టుదలగా ఈ సినిమా చేశారు. ఆయన శ్రమ ట్రైలర్ లో ఉన్న క్వాలిటీతో తెలుస్తోంది. పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. ఒక చంద్రముఖి, కాంచనలాగా ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ కావాలని అన్నారు.

నటుడు పీఆర్ఓ సురేష్ కొండేటి మాట్లాడుతూ.. సినిమా ఎప్పుడు వచ్చిందనేది కాదు ఎంత సక్సెస్ అయ్యింది అనేది ఈ నెల 27న తెలుస్తుంది. ఎంతోమంది పేరున్న ఆర్టిస్టులు ఈ మూవీకి వర్క్ చేశారు. అలాగే స్ట్రాంగ్ కంటెంట్ తో సినిమాను చేశారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అయి సుమన్ బాబు గారితో పాటు టీమ్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నామన్నారు.

ఇవి కూడా చదవండి: