Dulquer Salmaan: హైదరాబాద్ ఘనంగా దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ప్రారంభోత్సవం – హీరోయిన్ ఎవరంటే..!
Aakasamlo Oka Thara movie Launched: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు, వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. కోలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అతడు పాన్ ఇండియా స్టార్‌గా తనకంటూ సొంత ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో నటిస్తున్నాడు. ముఖ్యంగా తెలుగులో దుల్కర్ నటించిన మూడు స్ట్రయిట్ సినిమాలు మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ బ్లాక్‌బస్ట్ హిట్స్ అందుకున్నాయి.
దీంతో ఇప్పుడు మరో కొత్త సినిమా ‘ఆకాశంలో ఒక తార’ చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ పతాకంలో ఈ సినిమా రూపొందబోతోంది. ఇదివరకే దీనిపై ప్రకటన రాగా తాజాగా పూజ కార్యక్రమంలో గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ పూజ కార్యక్రమానికి హీరో దుల్కర్ సల్మాన్, నిర్మాత అల్లు అరవింద్, అశ్వనీ దత్, స్వప్న దత్‌తో సహా మూవీ టీం సభ్యులతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. పవన్ సాదినేని దర్శకత్వం వహించబోతోన్న ఈ సినిమా త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనుంది.
Smiles.
Blessings.
And a Sky full of dreams ❤️#AakasamLoOkaTara takes off with a Pooja Ceremony 📸💫#AOTMovie@dulQuer @GeethaArts @SwapnaCinema @Lightboxoffl @pavansadineni @sunnygunnam @Ramya_Gunnam @SwapnaDuttCh @sujithsarang pic.twitter.com/iGyNZml8CN— Geetha Arts (@GeethaArts) February 2, 2025
ఈ మూవీ అనౌన్స్‌మెంట్ సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ మూవీపై ఆసక్తి పెంచింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. గీతా ఆర్ట్స్‌తో ఆపటు లైట్స్ బాక్సా మీఇయా, స్వప్ప సినిమాల సంస్థలు సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. సందీప్ గుణ్ణం, రమ్మ గుణ్ణం నిర్మాతలుగా వ్యవహరించబోతోన్న ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది. ఈ చిత్రంతో కొత్త అమ్మాయి హీరోయిన్‌గా నటిస్తున్నట్టు సమాచారం. ఆమె పేరు సాత్విక వీరవల్లి అని టాక్. ఇప్పటి వరకు హీరోయిన్ వ్యక్తిగత విషయాలు, బ్యాగ్రౌండ్‌పై ఎలాంటి క్లారిటీ లేదు. ఆమె తమిళ అమ్మాయని, విదేశాల్లో చదువుకుంటున్నట్టు సమాచారం.