Published On:

Disha Patani Sister: పాతబడ్డ ఇంటిలో అనాథగా చిన్నారి – కాపాడిన హీరోయిన్‌ సోదరి

Disha Patani Sister: పాతబడ్డ ఇంటిలో అనాథగా చిన్నారి – కాపాడిన హీరోయిన్‌ సోదరి

Disha Patani Sister Saved Girl Child: బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీ సోదరి ఖుష్బూ షేర్‌ చేసిన ఓ వీడియో ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఓ పాతబడ్డ ఇంటిలో అనాథగా ఉన్న చిన్నారి.. ఏడుస్తున్న వీడియోను షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. కాగా దిశా పటానీ అక్కడ ఖుష్బూ పటానీ ఆర్మీలో మేజర్‌గా సేవలందించారు. 12 ఏళ్ల పాటు ఆర్మీలో ఉన్న ఆమె రెండేళ్ల క్రితమే రిటైర్‌మెంట్‌ తీసుకుని ప్రస్తుతం ఫిట్‌నెస్‌ కోచ్‌గా పని చేస్తున్నారు.

 

ఇందుకు సంబంధించిన వీడియోలో తరచూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తుంటారు. అయితే తాజాగా ఆమె ఓ చిన్నారికి సంబంధించిన వీడియో షేర్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌ బరేలిలో నివసిస్తున్న ఖుష్బూ తన ఇంటి సమీపంలో వాకింగ్‌ చేస్తున్నారు. అయితే అక్కడ ఉన్న ఓ పాడుబడ్డ ఇంటి నుంచి చిన్నారి ఏడుపులు వినిపించడంతో లోపలికి వెళ్లి చూసింది. అక్కడ ఏడాది వయసున్న చిన్నారి నెలపై పడుకున్న ఏడుస్తూ కనిపించింది. ఆమె ఒళ్లంత మట్టితో ఏడ్చి ఏడ్చి అలిసిపోయి కనిపించింది. ఆ చిన్నారిని చూడగానే ఖుష్బూ మనసు తరుక్కుపోయింది.ఆ పాపను దగ్గరికి వెళ్లి ఏమైంది అన్నట్టు ఓదారుస్తు తన చేతిలోకి తీసుకుంది. ఈ ఆడపిల్లని అని పాప తల్లిదండ్రులు ఈ చిన్నారిని అనాథ వదిలేశారని ఆమె వాపోయింది. చిన్నారిని ఎత్తుకుని ఆమెను లాలించారు.

 

చివరిలో పాప ముఖాన్ని దగ్గరగా చూపించి.. చిన్నారి గురించి తెలిసిన వాళ్లు సంప్రదించాలని కోరారు. అనంతరం ఆమె పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడి చేరుకున్నారు. ఇక వైద్య పరీక్షల నిమిత్తం పోలీసు ఆఫీసర్‌ చిన్నారిని ఆస్పత్రికి తీసుకువెళ్లారు.  చిన్నారిని అలా అనాథగా వదిలేసిన పాప తల్లిదండ్రులపై ఖుష్బూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరేం తల్లిదండ్రులు.. అభంశుభం తెలియని ఈ పాప భవిష్యత్తును అనాథగా వదిలేసినందుకు సిగ్గుపడండి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ వీడియో ఆమె షేర్‌ చేస్తూ ఇలా క్యాప్షన్‌ ఇచ్చారు. “అధికారులు ఆమెను జాగ్రత్తగా చూసుకుంటారని, సరైన నియమ.. ధనలతో ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నాను. సేవ్‌ గర్ల్‌ చైల్డ్‌. ఇంకా ఎంతకాలం ఆడపిల్లలపై ఈ వివక్ష. ఈ చిన్నారి సరైన చేతిలోకి వెళ్తుందని, ఆమె జీవితం ఇక నుంచి అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్నాను” అంటూ ఆమె రాసుకొచ్చారు.

 

View this post on Instagram

 

A post shared by Major Khushboo Patani(KP) (@khushboo_patani)